ఏం చేద్దాం!

10 Aug, 2015 08:14 IST|Sakshi
ఏం చేద్దాం!

 సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేకు బీజేపీ దగ్గర కావడంతో తదుపరి తమ కార్యచరణ మీద డీఎండీకే అధినేత విజయకాంత్ దృష్టి కేంద్రీకరించారు. పొత్తుల కసరత్తుల్లో భాగంగా ఆదివారం పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి పార్టీ వర్గాలతో సమాలోచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పయనించిన డీఎండీకే నేత విజయకాంత్‌కు అదృష్టం కలసి వచ్చి ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించిన విషయం తెలిసిందే. తదుపరి పరిణామాలతో ఆ పార్టీతో పెంచుకున్న వైర్యం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వైపుగా అడుగులు వేయించింది. ఆ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతుతో భంగ పడ్డ విజయకాంత్ బీజేపీకి విధేయుడిగానే ఉంటూ వచ్చారని చెప్పవచ్చు.
 
  కొన్ని సందర్భాల్లో ఆ కూటమిలో లేనన్నట్టుగా వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, బీజేపీ కూటమికి సీఎం అభ్యర్థిగా తానే ఉంటానన్న భావనలో ఉంటూ వచ్చిన విజయకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన ఆలోచనలో పడేసింది. అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఇంటికి నరేంద్ర మోదీ వెళ్లడం విజయకాంత్‌కు పెద్ద షాక్కే. ఈ పరిస్థితుల్లో  అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య పొత్తు ఖరారైనట్టుగా సంకేతాలు రావడంతో తదుపరి తన కార్యచరణ మీద దృష్టి పెట్టే పనిలో విజయకాంత్ పడ్డారు. ఇందుకోసం అత్యవసరంగా ఆదివారం పార్టీ కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చారు.
 
 సమాలోచన : కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో ఉదయం పది గంటల కు విజయకాంత్ నేతృత్వంలో సమావేశం ఆరంభం అయింది. ఇందులో బీ జేపీతో ఇక కలిసి పనిచేయడం కష్టమేన న్న విషయాన్ని గ్రహించి ,ప్రత్యామ్నా య పొత్తుల అన్వేషణపై పార్టీ వర్గాల అభిప్రాయాల్ని విజయకాంత్ సేకరించి నట్టు సమాచారం. ప్రధానంగా  ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకేలతో కలసి తన నేతృత్వంలో కూటమిని ఏర్పాటు చేయడం లేదా, డీఎంకే కూటమిలోకి వెళ్లడమా..? అన్న అంశంపై చర్చ సాగి నట్టు తెలిసింది. మెజారిటీ శాతం మం ది గతంలో వలే దూకుడు నిర్ణయాలు వ ద్దు అని, ఆలోచించి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళదామంటూ విజయకాంత్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ సమావేశంలో ముందుగా భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మౌనం పాటించారు.
 
 తీర్మానాలు : ఈ సమావేశంలో పొత్తుల కసరత్తు చర్చకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినా, చివరకు కొన్ని తీర్మానాలు చేసి మీడియాకు ప్రకటించారు. అలాగే, త మ అధినేత విజయకాంత్ బర్త్‌డే వేడుక లు నెల రోజుల పాటుగా సాగనున్న నేపథ్యంలో ప్రజా హిత కార్యక్రమాలకు సిద్ధం అయ్యారు. ఇక, మద్యం ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నిర్ణయిం చారు. ఆగస్టు 15లోపు రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధంపై తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మానవ హారంలో పాల్గొన్న తమ పార్టీ వర్గాలపై పోలీసుల లాఠీ చార్జ్‌ను తీవ్రంగా ఖం డించారు. నాగపట్నం, తంజావూరు, తిరువారూర్‌లో మిథైన్ తవ్వకాలకు శాశ్వత నిషేధం విధించాలని, గ్రానైట్, రాళ్ల క్వారీలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే, భారత రత్న అబ్దుల్ కలాం అంత్యక్రియలకు సీఎం జయలలిత గైర్హాజరుపై తీవ్రంగా మండి పడుతూ ప్రత్యేక తీర్మానం చేశారు.
 

మరిన్ని వార్తలు