మేము క్వారంటైన్‌కు వెళ్లాలా?

16 Jun, 2020 07:54 IST|Sakshi
గ్రామస్థుల దాడిలో ధ్వంసమైన ఓ వాహనం

అధికారులపై తాండావాసుల దాడి

వాహనాలు ధ్వంసం

యశవంతపుర: కలబురిగి జిల్లా కమలాపుర తాలూకా మరమంచి గ్రామంలో సోమవారం కరోనా సోకిన వ్యక్తులను ఆస్పత్రికి తీసుకెళ్లటానికి వెళ్లిన ఆశా కార్యకర్తల వాహనంపై గ్రామస్థులు రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వసం చేశారు. మరమంచి తాండాలో 15 మందికి కరోనా లక్షణాలు పాజిటివ్‌గా వచ్చాయి. వీరందరూ ముంబై నుంచి వచ్చినవారుగా గుర్తించి ఆస్పత్రికి తరలించటానికి తాండాకు అధికారులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్‌తో కలిసి వెళ్లారు. ఎవరెవరు ముంబై నుంచి వచ్చారో వివరాలను సేకరిస్తూ ఊరులో తిరిగారు. (పోలీస్‌ స్టేషన్లో పేకాట..!)

అందరూ ఆస్పత్రికి వెళ్లి క్వారంటైన్‌లో ఉండాలను సూచించారు. అయితే తమలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని అనవసరంగా తీసుకేళ్తారా అని బాధితుల బంధువులు గొడవకు దిగారు. ముంబై నుండి వచ్చినవారు అంబులెన్స్‌లో ఎక్కాలని వైద్యులు డిమాండ్‌ చేశారు. తమవారికి కరోనా లేదని గ్రామస్తులు మొండికేశారు. చివరకు కోపం పట్టలేక అంబులెన్స్‌తో పాటు వైద్యులు, పోలీసుల వాహనాలపై రాళ్లు విసిరారు. రాళ్ల దాడిని తట్టుకోలేక అధికారులు తలోదిక్కుకు పరుగులు తీశారు. వాహనాలపై రాళ్లు విసరడంతో అద్దాలు పగిలాయి. గ్రామంలో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. (చెన్నైలో మళ్లీ లాక్‌డౌన్‌)

పోలీసులే కొట్టారు 
పోలీసులే తమపై దాడి చేసి దౌర్జన్యాలకు పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపించారు.  పోలీసులు తమను కొట్టడంతో కాలు, వీపుపై గాయాలైన చిత్రాలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో సోమవారం మధ్యాహ్నం అదనపు ఎస్పీ ప్రసన్న దేశాయి, సీఐ రాఘవేంద్ర భజంత్రి, తహశీల్దార్‌ అంజుమ్‌ తబసుమ్‌లు తాండాలో పర్యటించి గ్రామస్థులకు కరోనాపై వివరించి శాంతపరిచారు. ముంబై నుండి వచ్చినవారు క్వారంటైన్‌కు వెళ్లకంటే ప్రమాదం తలెత్తుతుందని చాటింపు వేయించారు. (వర్క్‌ ఫ్రం హోంకే జై!)

>
మరిన్ని వార్తలు