డాక్టర్‌ అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు

11 Jun, 2020 13:42 IST|Sakshi
డాక్టర్‌ సుధ(ఫైల్‌)

వేలూరు: చెన్నైలో ఆత్మహత్య చేసుకున్న మహిళా డాక్టర్‌ మృతదేహానికి సొంత గ్రామంలో అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్తులు వ్యతిరేకించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెలితే తిరుపత్తూరు జిల్లా అంబూరు తాలుకా కృష్ణాపురం పనకార వీధికి చెందిన రాజంద్రన్‌ కుమార్తె సుధ(32). ఈమె చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా పనిచేస్తుంది. ఈమెకు రాణిపేటకు చెందిన దంత డాక్టర్‌ సత్యకు గత కొద్ది రోజుల క్రితం వివాహమై జరిగి ఇద్దరు పిల్లలున్నారు. సుధ, సత్యలు కలిసి చెన్నైలోని షోళింగనల్లూరులో ఉంటూ ఆసుపత్రికి వెళ్లి వచ్చే వారు.

దంపతుల మధ్య తరచూ చిన్న చిన్న ఘర్షణలు జరిగేవి. దీంతో మనో వేదనతో ఉన్న సుధ గత సోమవారం ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో షోలింగనల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అనంతరం మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. దీంతో సుధ తండ్రి రాజంద్రన్‌ మృత దేహాన్ని అంబులెన్స్‌ ద్వారా ఆంబూరులోని సొంత గ్రామంలో దహన క్రియలు చేసేందుకు తీసుకొచ్చాడు. కరోనా నేపథ్యంలో స్థానికులు అంత్యక్రియలను అడ్డుకునే యత్నం చేశారు. వీఏఓ దినగరన్‌ ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతురాలి బంధువులను పూర్తిగా అక్కడ నుంచి పంపంచి 12 మందితో ఆంబూరు పాలారులో అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు