డ్యాన్స్ అకాడమీ నెలకొల్పాలని ఆశ

7 Jan, 2015 03:08 IST|Sakshi
డ్యాన్స్ అకాడమీ నెలకొల్పాలని ఆశ

 చెన్నైలో  డ్యాన్స్ ‌అకాడమీ నెలకొల్పాలని ఉందని నటి విమలా రామన్ పేర్కొన్నారు. పొయ్‌చిత్రం ద్వారా తెర మీదకు వచ్చిన ఈ మలయాళీ బ్యూటీ ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా, నిలదొక్కుకోలేక పోయింది. అటుపై టాలీవుడ్‌లో అందాలను ఆరబోసినా ఫలితం లేదు. ప్రస్తుతం మలయాళం, కన్నడం భాషలపై దృష్టి పెట్టారు. భారత నాట్యంలో ప్రావీణ్యం పొందిన విమలా రామన్ త్వరలో చెన్నైలో డ్యాన్స్ అకాడమీ నెలకొల్పే యోచనలో ఉన్నారు. ఈ విషయమై ఆమె పేర్కొంటూ, మయూరి, సాగర సంగమంలాంటి కొన్ని సంగీత భరిత చిత్రాలను చూసి స్ఫూర్తి పొందినట్టు తెలిపారు. స్వతహాగా నృత్య కళాకారిణి కావడంతో ఆ చిత్రాలు తనకు క్యాష్‌నెట్‌గా మారాయన్నారు.
 
 దేశ విదేశాల్లో 200కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చానన్నారు. ఈ మధ్య సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ ఓపెనింగ్ రోజున తన నృత్య కార్యక్రమం జరిగిందని తెలిపారు. త్వరలో చెన్నైలో నృత్య అకాడమీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కన్నడంలో పొన్ కుమరన్(లింగ చిత్ర కథరచయిత) దర్శకత్వంలో రాజా రవీంద్ర చిత్రంలో నటిస్తున్నట్టు తెలిపారు. ఇది 1920లో జరిగిన యథార్థ గాథకు నిదర్శనంగా వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో తనది రాయల్ ఫ్యామిలీకి  చెందిన యువతి పాత్రగా పేర్కొన్నారు. ఈ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు. అదే విధంగా మలయాళంలో టర్నింగ్ పాయింట్ చిత్రంలో నటిస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు