భార్య ఎదుటే రొమాన్స్ చేశా

19 Jul, 2015 02:14 IST|Sakshi
భార్య ఎదుటే రొమాన్స్ చేశా

సినిమా వాళ్లంటే చులకన భావం, ఒక రకమైన అభద్రత ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. అదిప్పుడు పూర్తిగా పోయిందని కచ్చితంగా చెప్పలేం. నటుడు విష్ణువిశాల్ ప్రేమ కథ వింటే సినిమా వాళ్లపై అపోహలు పూర్తిగా తొలగిపోలేదన్నది సుస్పష్టం అవుతుంది. విష్ణువిశాల్ ఈయన అసలు పేరు విష్ణు. నటుడైన తరువాత విష్ణువిశాల్‌గా మార్చుకున్నారు. ఈయన ఒక పోలీస్‌అధికారి కొడుకు. సినిమా, క్రికెట్ అంటే పిచ్చి.అందులో శిక్షణ కూడా పొందారు. ఈయనకో ప్రేయసి ఉంది.పేరు రజిని. వరుసకు మామ కూతురే. విష్ణువిశాల్‌కు సినిమాలో నటించాలని మక్కువ. అవకాశాల కోసం ప్రయత్నించి నిరాశ చెందారు. దాంతో వేరే జాబు చేసుకుంటున్నారు. విష్ణు ప్రియురాలి తండ్రి ఒక్క సినిమా వాళ్లను మినహా ఎవరిని పెళ్లి చేసుకో అని కండిషన్ పెట్టారట. ఈ కుటుంబం సినిమాకు వ్యతిరేకం కాదు గానీ సినిమా వాళ్లతో పెళ్లి సంబంధాలకు ససేమిరా అంగీకరించరు. మొత్తం మీద విష్ణువిశాల్, రజినీల పెళ్లి జరిగిపోయింది.

  భార్య కళ్లెదుటే రొమాన్స్
ఆ తరువాతే అసలు కథ మొదలైంది. విష్ణువిశాల్‌కు దర్శకుడు సుశీంద్రన్ నుంచి పిలుపొచ్చింది. వెన్నెల కబడీ కుళు చిత్రంలో కథానాయకుడిగా అవకాశం. కలలు కన్న జీవితం. ఇటు సినిమా వాళ్లంటే పడని భార్య వర్గం. ఏదో తంటాలు పడి భార్యను ఒప్పించగలిగారు. మరి మామ గారి విషయం. ఆ భాధ్యతల్ని ఆయన భార్య తీసుకున్నారు. నేను వద్దని గోల చేస్తాను మీరు దాన్ని భరించండి. అలా కొంత కాలం తరువాత అంతా సర్దుకుంటుంది. అన్న అర్ధాంగి సూచనను విష్ణువిశాల్ తూచ తప్పకుండా పాటించి సినిమా హీరో అయిపోయారు.ఆ తరువాత నీర్‌పరవై చిత్రంలో భార్య కళ్లెదుటే హీరోయిన్ సునైనను కౌగిలించుకుంటే ఆమె ఇందుకే సినిమాలు వద్దన్నాను అంటూ కాసేపు రాద్దాంతం చేసింది, ఆ తరువాత నటనే కదా అని సర్దుకుంది అన్న విష్ణువిశాల్ ప్రస్తుతం యువ హీరోలలో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఇటీవల జీవా, ముండాసుపట్టి,నేట్రు ఇండ్రు నాళై  వరుసగా మూడు చిత్రాల విజయాలు సొంతం చేసుకున్నారు. ఈ విజయోత్సాహంతో శుక్రవారం తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. ఈ ఆనందాన్ని విలేకరులతో పంచుకుంటూ ఈ రోజు తానీస్థాయిలో ఉండడానికి చాలా మంది కారణం. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. తొలి చిత్ర అవకాశం ఇచ్చిన సుశీంద్రన్, నీర్‌పరవై చిత్ర దర్శకుడు శీనురామసామి, కష్టకాలలో ఉన్న తనను ప్రోత్సహించిన విత్రులు విశాల్, ఆర్యలకు కృతజ్ఞతలు అన్నారు.

  స్నేహితులంటే వారే
నిజమైన స్నేహితులంటే విశాల్, ఆర్యలేనని అన్నారు. సాధారణంగా ఒక హీరో చిత్రాన్ని మరొకరు పట్టించుకోరన్నారు. అలాంటిది తాను నటించిన జీవా చిత్రాన్ని విశాల్, ఆర్య విడుదల చేశారని ఈ సందర్భంగా  చెప్పారు. ప్రస్తుతం ఇదం పొరుళ్ ఎవల్, వీర ధీర శూరన్, కలక్కరాయ్‌మాప్పిళే, పోడా ఆండవనే ఎన్ పక్కమ్ చిత్రాల్లో నటిస్తునట్లు విష్ణువిశాల్ వెల్లడించారు.  
 

మరిన్ని వార్తలు