తగ్గుతున్న నీటి నిల్వలు

24 May, 2014 22:55 IST|Sakshi

సాక్షి, ముంబై:  రాష్ట్రవ్యాప్తంగా నీటి నిల్వలు రోజు రోజుకీ అడుగ ంటుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి అధికమవుతోంది. దీనికితోడు తీవ్రమవుతున్న ఎండలు... ఇక సమయానికి వర్షాలు కురవకపోతే పరిస్థితి తీవ్రంగా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యం గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలో ఏప్రిల్ నెల ముగిసే సమయానికి సుమారు 33  శాతంగా ఉన్న నీటి నిల్వలు, మే చివరి వారం వరకు 28  శాతానికి పడిపోయాయి. అంటే ఐదు శాతం తగ్గిపోయాయి. ఓ వైపు వర్షాకాలం వచ్చేందుకు మరో 20 రోజుల సమయం పట్టేట్టు ఉంది. మరోవైపు ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిపోయాయి.

 ఇంకొన్ని రోజులు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో మరింత నీటి నిల్వలు పడిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా మహారాష్ట్రకు ఈ ఏడాది కూడా నీటి ఎద్దడి తప్పేట్టు లేదని అధికారులు ఆందోళన చెందుతునన్నారు. అయితే గత సంవత్సరం ఇదే సమయానికి రాష్ట్రంలో 20 శాతం మాత్రమే నీటి నిల్వలుండడంతో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో గత సంవత్సరం రాష్ట్రంలోని పలు ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా కూడా ప్రకటించారు. అయితే ప్రస్తుతం గతంలోకంటే  పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ పెరుగుతున్న ఎండలు, ఆలస్యమవుతున్న వానాకాలం... వెరసి అధికారులతోపాటు ప్రజను భయాందోళనలకు గురి చేస్తోం ది. ముఖ్యంగా రాష్ట్రంలో ఆరు రెవిన్యూ విభాగాలలో 84 భారీ ప్రాజెక్టులున్నాయి.

 వీటిలో అత్యంత తక్కువ నీటి నిల్వలతో మరాఠ్వాడా పరిస్ధితిదారుణంగా ఉంది. ఇక పుణే, మరాఠ్వాడా విభాగాల్లో మిగతా విభాగాలకంటే తక్కువ శాతం నీటి నిల్వలుండగా, అత్యధికంగా నాగపూర్ విబాగంలో అత్యధిక శాతం నీటి నిల్వలున్నాయి. వర్షాలు సమయానికి వచ్చే అవకాశాలులేవని వాతవరణ శాఖ హెచ్చరించడంతోపాటు సగటు వర్షపాతం ఈ సారి తక్కువగా ఉంటుందని కూడా పేర్కొంది. ఈ నేపథ్యలలో వర్షాలు తక్కువగా కురిసినట్టయితే రాబోయే రోజు ల్లో కొన్ని ప్రాంతాలకు నీటికోత ఎక్కువవుతుంది. ఇక నీటి కోత లేని ప్రాంతాల్లో సైతం కోత ప్రారంభించాల్సి ఉంటుంది.

 ఇప్పటికే మరాఠ్వాడాతోపాటు పశ్చిమ మహా రాష్ట్ర, ఉత్తర మహారాష్ట్రలలోని అనేక గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఎండ లు ఇలాగే కొనసాగినట్టయితే గ్రామాలు దుర్భరమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయి. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు