వాట్స్‌యాప్... హ్యాట్సాఫ్..!

24 Jun, 2014 05:42 IST|Sakshi
వాట్స్‌యాప్... హ్యాట్సాఫ్..!
 • టెక్కీ ప్రాణాలు కాపాడిన  సాంకేతిక పరిజ్ఞానం
 •  సాహస యాత్రలో అపశ్రుతి
 •  60 అడుగుల లోయలో పడిపోయిన టెక్కీ
 •  స్నేహితురాలి ఫోన్‌తో స్పృహలోకి
 • బెంగళూరు : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఓ టెక్కీ ప్రాణాలు కాపాడింది. 60 అడుగుల లోయలోకి పడిపోయిన ఆయన, స్నేహితురాలి ఫోన్‌తో స్పృహలోకి వచ్చి తను ఉన్న ప్రాంతాన్ని ఫొటోలు తీసి వాట్స్‌యాప్ ద్వారా స్నేహితురాలి సెల్‌కు పంపించడంతో తక్షణమే స్పందిం చిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చి కొన్ని గంటల్లో నే బాధితుడిని ట్రేస్ చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన తుమకూరు జిల్లాలో జరిగింది.

  ఢిల్లీకి చెందిన గౌరవ్ అనే యువకుడు బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న గౌరవ్ ఆదివారం మధ్యాహ్నం స్నేహితురాలు ప్రియాంక శర్మతో కలిసి తుమకూరు జిల్లాలోని మధుగురి ఏకశిల కొండకు బయలుదేరాడు.

  ఇద్దరు కలిసి కొండ ఎక్కుతుండగా సగభాగానికి చేరుకున్న సమయంలో ప్రియాంక తన వల్ల కాదని వెనుతిరిగిపోయింది. అయితే గౌరవ్ మాత్రం ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు. కొండపైకి ఎక్కి తిరిగి కిందకు దిగుతుండగా కాలుజారి 60 అడుగుల లోయలోకి పడిపోయాడు. రాత్రి సవ ుయం అయినా గౌరవ్ రాకపోవడంతో ప్రియాంక అతడి సెల్ ఫోన్ చేసింది. స్పృహలోకి వచ్చిన గౌరవ్ తను ఉన్న ప్రాంతాన్ని ఫొటోలు తీసి వాట్స్‌యాప్ ద్వారా ప్రియాం కు పంపించాడు.

  ప్రియాంక నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అటవీ, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కొన్ని గంటల పాటు శ్రమించి గౌరవ్‌ను గుర్తించి బయటకు తీసుకువచ్చారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం బెంగళూరు కుతరలించారు. గౌరవ్ కోలుకుంటున్నట్లు చెప్పారు.
   

మరిన్ని వార్తలు