రేపటి నుంచి అకాల వర్షాలు

27 Jan, 2020 13:19 IST|Sakshi

స్కైమెట్‌ వెదర్‌.కామ్‌

భువనేశ్వర్‌: రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం జారీ చేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ వర్షాలు ప్రారంభమవుతాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. 24 గంటల పాటు నిరవధికంగా ఈ వాతావరణం నెలకొని, మర్నాడు బుధవారం వరకు వర్షం కురుస్తుందన్న స్పష్టమైన సమాచారాన్ని స్కైమెట్‌ వెదర్‌.కామ్‌ సంస్థ తెలిపింది. ఈ నెల 30వ తేదీన ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వర్ష సూచన జారీ అయింది. రాత్రి పూట ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టిన అనంతరం వర్షం పుంజుకుంటుంది. ఈ నెల 28వ తేదీన స్వల్ప స్థాయి నుంచి మోస్తరు స్థాయి వర్షాలు పడవచ్చని వాతావరణ విభాగ కేంద్రం పేర్కొంది. కటక్, అంగుల్, ఢెంకనాల్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రాపడా, ఝార్సుగుడ, మయూర్‌భంజ్, కెంజొహర్‌ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షపు జల్లులు కురుస్తాయి. మయూర్‌భంజ్, కెంజొహర్, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రాపడా ప్రాంతాల్లో ఈ అకాల వర్షాలు కురుస్తాయి. ఈ నెల 30వ తేదీ రాత్రి ఉష్ణోగ్రత క్రమంగా 4 నుంచి 6 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరుగుతుందని వాతావరణ కేంద్రం ముందస్తు సమాచారం జారీ చేసింది. 

మరిన్ని వార్తలు