ఉత్తరకోస్తాకు భారీ వర్ష సూచన

28 Sep, 2016 13:23 IST|Sakshi
ఉత్తరకోస్తాకు భారీ వర్ష సూచన
విశాఖ: ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నట్టు అధికారులు తెలిపారు. రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
 
మరిన్ని వార్తలు