ఒకే ఒక్కడు

26 May, 2014 22:32 IST|Sakshi

 న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ కేబినెట్ టీమ్‌లో మన డాక్టర్ సాబ్ హర్షవర్ధన్‌కు చోటు దక్కింది. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 21 ఏళ్ల నుంచి రాజకీయ సేవలు అందిస్తున్న హర్షవర్ధన్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలు కమలనాథుల ఖాతాల్లో వేయడంలో కీలకపాత్ర పోషించారు. ఢిల్లీ బీజేపీ నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చి అద్భుత ఫలితాలను రాబట్టారు. చాందినీ చౌక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్‌పై గెలిచారు.

 ఆర్‌ఎస్‌ఎస్ నుంచి మొదలు...
 చిన్నప్పటి నుంచే రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సభ్యుడిగా హర్షవర్ధన్ ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు హాజరవుతుండేవారు. అక్కడి నుంచి ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో బీజేపీలో చేరారు. 1993లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైద్య, న్యాయ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఇదే సమయంలో 1994, అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకొని భారీ ఎత్తున పోలియో కార్యక్రమాన్ని నిర్వహించి ఒక్కరోజులోనే 12 లక్షల పిల్లలకు పోలియో చుక్కలు అందేలా చూశారు. అప్పుడు పది శాతం ఉన్న పోలియో కేసులు ఆ తర్వాత పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. 1996లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన 1998, 2003 అసెంబ్లీ ఎన్నికల్లోనూ హర్షవర్ధన్ గెలిచారు. అదే సీటు నుంచి 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన దీపికా కుల్లార్‌పై 3,204 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసమస్యలపై దృష్టి సారిస్తూ ఎప్పుడూ ప్రజలతో మమేకమవుతూ అందరి బాగోగులు తెలుసుకుంటుండేవారు. మొదటి నుంచి ఇప్పటివరకు పోటీచేసిన ఎన్నికల్లో ఓటమెరుగని హర్షవర్ధన్ పనితనాన్ని గుర్తించి బీజేపీ అధిష్టానం 2013 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ 23న ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరును ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే హర్షవర్ధన్ బీజేపీ నేతలను ఏకతాటిపైకి తెచ్చి పార్టీని విజయపథాన తీసుకెళ్లారు. అయితే దురదృష్టవశాత్తూ డిసెంబర్ ఎనిమిదిన జరిగిన ఎన్నికల్లో 70 సీట్లకు గానూ 32 స్థానాలు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు నాలుగు సీట్ల ఆమడదూ
 
 రంలోబయోడేటా...
 1953 డిసెంబర్ 13న ఢిల్లీలో ఓంప్రకాశ్ గోయ ల్, స్నేహలతలకు హర్షవర్ధన్ జన్మించారు. 1971లో దర్యగంజ్‌లోని ఆంగ్లో సంస్కృత్ విక్టోరి యా జూబ్లీ సీనియర్ సెకండరీ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. 1979లో కాన్పూర్‌లోని గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచ్‌లర్ ఆఫ్ సర్జరీ గ్రాడ్యుయేట్ చేశారు. 1983లో అదే కాలేజీ నుంచి ఒట్టోలరినాలాజీలో మాస్టర్ ఆఫ్ సర్జరీ పట్టా పొందారు. హర్షవర్ధన్‌కు భార్య న్యూటన్, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
 
 ఎన్సీఆర్ నుంచి ముగ్గురు
 సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ మంత్రివర్గంలో జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్) నుంచి ముగ్గురికి మంత్రి పదవులు లభించాయి. గుర్గావ్ ఎంపీ రావ్ ఇందర్‌జీత్ సింగ్, ఘజియాబాద్ పార్లమెంట్ సభ్యుడు రిటైర్డ్ జనరల్ వీకే సింగ్, ఫరీదాబాద్ ఎంపీకృష్ణపాల్ సోమవారం సాయంత్రం రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో నరేంద్ర మోడీతో పాటు  పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వీకేసింగ్. రావ్ ఇందర్‌జీత్ సింగ్ స్వతంత్ర మంత్రిత్వశాఖ, కృష్ణపాల్ సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
 

మరిన్ని వార్తలు