న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించండి

1 Sep, 2013 01:43 IST|Sakshi
తిరువళ్లూరు, న్యూస్‌లైన్:న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా న్యాయవాదుల ప్రవర్తన, న్యాయమూర్తుల తీర్పు వుండాలని తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి మహ్మద్ జఫ్రుల్లాఖాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అదేశాలు మేరకు  తిరువళ్లూరు జిల్లా కోర్టు ఆవరణలో మోగా లోక్ అదాలత్‌ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని న్యాయమూర్తి జఫ్రుల్లాఖాన్  ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలకు నమ్మకం కలిగేలా న్యాయవ్యవస్థ ఉండాలని కోరారు. దీంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వాది ప్రతివాదులతో కోర్టు ఆవరణం క్రిక్కరిసింది. 
 
 లోక్‌అదాలత్‌లో చాలాకాలం పాటు పెండింగ్‌లో వున్న కేసులను విచారించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినవారు, డ్రైవింగ్ లెసైన్సు లేకుండా వాహనాలను నడిపిన, సారాయిని ఆక్రమంగా  విక్రయించిన కేసులు, విడాకుల కేసులు, ప్రమాదపు కేసులను పరిష్కరించారు. లోక్ అదాలత్ వలన జిల్లా వ్యాప్తంగా పేరుకుపోతున్న కేసుల సంఖ్య తగ్గే అవకాశం వుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి మురుగన్, శాంతి, యశ్వంత్‌రావు ఇంగర్‌సాల్, తమిళ్స్రితో పాటు న్యాయవాదులు రామ్‌కుమార్, శాంతకుమార్, పరిపూర్ణంతో పాటు పలువురు న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
 
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు