జయాస్త్రం

22 Jul, 2015 02:49 IST|Sakshi
జయాస్త్రం

చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘ధిక్కారమున్ సైతునా’ అంటూ ముఖ్యమంత్రి జయలలిత ప్రతిపక్ష నేతలపై పరువునష్టం దావాలను సంధిస్తున్నారు. పార్టీ నేతలకే కాదు, పత్రికల వారికి సైతం పరువునష్టం కేసులు పంపుతున్నారు. అన్నాడీఎంకే పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించినా, పథకాలను ఎద్దేవా చేసినా, వ్యక్తిగత విమర్శలకు పాల్పడినా పరువునష్టం కేసులు వేయడం జయకు పరిపాటి. ప్రతిపక్షాలన్న తరువాత విమర్శలు చేయడం మానవు, పరువునష్టం కేసులు దాఖలు చేయడం జయ మానరు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షులు ఈవీకేస్ ఇళంగోవన్ ఇటీవల కలైంజర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయ ఆరోగ్యంపై విమర్శలు సంధించారు. దీంతో వెంటనే జయ పరోక్షంగా మంత్రి ఏడపట్టి పళనిస్వామి కేసుల వెంటపడ్డాయి.
 
 ఇళంగోవన్‌తోపాటూ కలైంజర్ టీవీ ఎండీ అమృతం, డెప్యూటీ ఎండీ కుమాయూన్, ఛీఫ్ రిపోర్టర్ డాయల్ ఆగష్టు 21న కోర్టులో హాజరుకావాల్సిందిగా మంగళవారం సమన్లు అందాయి. తమిళ పక్షపత్రిక సైతం జయ ఆరోగ్యంపై కథనాన్ని ప్రచురించగా పరువునష్టం దావా కేసులో ఆగష్టు 27న కోర్టుకు హాజరుకావాలని మంగళవారం సమన్లు అందుకున్నారు.తాజాగా స్వామిపై:  ఇదిలా ఉండగా, భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామిపై పరువునష్టం దావా పడింది. ఈనెల 13వ తేదీన  ఏక్షణంలోనైనా చికిత్స కోసం అమెరికాకు పయనం అవుతారు’ అంటూ స్వామి ట్వీట్ చేశారు.
 

మరిన్ని వార్తలు