12 రోజుల తరువాత మహిళ మృతదేహానికి పోస్ట్‌మార్టం

17 Jul, 2015 04:14 IST|Sakshi
12 రోజుల తరువాత మహిళ మృతదేహానికి పోస్ట్‌మార్టం

- అనుమానాలను నివృత్తి చేయండి
 తిరువళ్లూరు : మహిళ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారీ పోలీసు బందోబస్తు నడుమ 12 రోజుల క్రితం మృతి చెందిన మహిళా మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. చెన్నై సమీపంలోని మణపాక్కం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కుమార్తె గాయత్రికి తిరువళ్లూరు జిల్లా కొత్తియంబాక్కం గ్రామానికి చెందిన విల్లర్‌కు ఎనిమిదేల్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సామువేల్(7), సాల్మన్(5) ఇద్దరు పిల్లలు. విల్లర్ న్యాయవాదినని అబద్దం చెప్పి వివాహం చేసుకున్నట్టు తెలిసింది. విషయం తెలిసి దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసుల విచారణలో తెలిసింది.
 
 ప్రస్తుతం విల్లర్ పూంద మల్లిలోని ప్రయివేటు కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తూ రాత్రుళ్లు మద్యం సేవించి అదనపు క ట్నం కోసం తరచూ భార్యను వేధించేవాడని గాయత్రీ తల్లిదండ్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో గాయత్రి నాలుగవ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఐదున అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల నేపథ్యంలో గాయత్రి మృతదేహం నుంచి రక్తం రావడంతో అనుమానించిన ఆమె కుటుంబసభ్యులు, బంధువులు  మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం డీఎస్పీ విజయకుమార్, పూందమల్లి తహశీల్దార్ అభిషేకం పర్యవేక్షణలో వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు