ఛేజ్ చేసి మహిళా డాక్టర్‌ను కాపాడాడు

27 Sep, 2016 11:35 IST|Sakshi
ఛేజ్ చేసి మహిళా డాక్టర్‌ను కాపాడాడు

చెన్నై: చెన్నైలో ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా డాక్టర్‌పై లైంగికదాడికి ప్రయత్నించాడు. మరో ఇద్దరితో కలసి ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కారు వెనుక వాహనంలో వెళ్తున్న ఓ వ్యక్తి డాక్టర్ అరుపులు విని చేజ్ చేసి స్థానికులతో కలసి ఆమెను రక్షించాడు.

మహిళా డాక్టర్ దక్షిణ చెన్నైలోని ఇంజంబక్కమ్ ప్రాంతంలో ఉంటోంది. ఆమె ఉత్తర చెన్నైలోని అంబట్టూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. గత ఆదివారం రాత్రి నైట్ షిఫ్ట్‌కు వెళ్లేందుకు క్యాబ్ మాట్లాడుకుంది. వీకెండ్ కావడంతో ఆదివారం ట్రాఫిక్ తక్కువగా ఉంది. క్యాబ్ డ్రైవర్ దారి మధ్యలో కారు ఆపగా, మరో ఇద్దరు వచ్చి వెనుక సీట్లో డాక్టర్‌కు అటూ ఇటూ కూర్చున్నారు. డాక్టర్ డ్రైవర్‌ను ప్రశ్నించగా, వాళ్లు తన స్నేహితులను,  దారి మధ్యలో దిగిపోతారని చెప్పాడు. డాక్టర్‌కు అనుమానం రావడంతో తన ఫ్రెండ్‌కు మెసేజ్ పంపి, కారును ఆపాల్సిందిగా డ్రైవర్‌కు చెప్పింది. కాగా డ్రైవర్ కారు ఆపకుండా మరింత వేగంగా వెళ్లగా, వెనుక కూర్చున్న ఇద్దరూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. సాయం చేయాల్సిందిగా డాక్టర్ కేకలు వేయడంతో వెనుక వాహనంలో వస్తున్న వ్యక్తి కారును ఛేజ్ చేసి ఆపాడు. స్థానికులు గుమికూడటంతో కారులో వెనుక ఉన్న ఇద్దరూ పరారయ్యారు. స్థానికులు క్యాబ్ డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు క్యాబ్ డ్రైవర్ మరుదును విచారించి మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా