కారు ఢీకొని మహిళ మృతి

21 Oct, 2016 16:38 IST|Sakshi
కరీంనగర్: వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మరియమ్మ(36) రాజీవ్ రహదారిపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు