17 ఏళ్ల అబ్బాయితో యువతి ప్రేమాయణం

2 Jun, 2017 19:05 IST|Sakshi
17 ఏళ్ల అబ్బాయితో యువతి ప్రేమాయణం

► పెళ్లి చేసుకోవాలని యువతి బ్లాక్‌ మెయిల్‌

బెంగళూరు: పరిణిత లేని బాలుడు...విద్యావంతురాలైన యువతి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా ఒక్కటి కావటంతో యువతి గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా అందుకు బాలుడు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన వీడియోను చూపించి యువతి బెదిరించడంతో అతడు ఆత్మహత్యకు యత్నించాడు.

ఈ ఘటన కర్ణాటకలోని తిలక్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. జయనగర్‌ లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న 17 ఏళ్ల బాలుడు ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడితో పక్కింటిలో ఉంటున్న 25 ఏళ్ల యువతి ప్రేమలో పడింది. ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.

యువతి గర్భవతి కావడంతో తనను పెళ్లి చేసుకోవాలని బాలుడిని కోరింది. అతడు అంగీకరించకపోవటంతో ఇరు కుటుంబాల వారి మధ్య చర్చలు జరిగాయి. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని యువతి కుటుంబీకులు డిమాండ్‌ చేశారు. దీనికి అతడి కుటుంబసభ్యులు ససేమిరా అన్నారు.

అయితే, ఇద్దరూ కలిసి ఉండగా తీసిన అభ్యంతరకర వీడియో యువతి వద్ద ఉండటంతో.... దీనిని చూపించి ఆ కుర్రాడి తల్లిదండ్రులను బ్లాక్‌మెయిల్‌ కు పాల్పడింది. దీంతో బాధిత బాలుడు గురువారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించడంతో, అతడి కుటుంబసభ్యులు యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతితోపాటు బాలుడిపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు