తాళిబొట్ల అప్పగింత ఆందోళన

30 Jan, 2020 08:39 IST|Sakshi
తిరుపూర్‌ కలెక్టరేట్‌లో తాళిబొట్ల అప్పగింత ఆందోళనలో పాల్గొన్న మహిళలు

తిరుపూర్‌ కలెక్టరేట్‌లో సంచలనం

టీ.నగర్‌: విద్యుత్‌ టవర్ల ఏర్పాటు పనులతో బాధిత రైతులకు అధిక నష్టపరిహారం చెల్లించాలంటూ మహిళలు తాళిబొట్ల అప్పగింత ఆందోళన బుధవారం జరిగింది. తిరుపూర్‌ జిల్లా, పల్లడం తాలూకా సెంబిపాళయం గ్రామంలో విద్యుత్‌ టవర్లు ఏర్పాటుచేసేందుకు 30 మంది రైతుల 200 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పనులు చేపట్టేందుకు వచ్చిన పవర్‌గ్రిడ్‌ సంస్థ సిబ్బందికి రైతులు వ్యతిరేకత తెలిపారు. ఇటీవల తమ ఇళ్లను ఖాళీ చేసి మేకలు, గేదలతో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో రెవెన్యూ అధికారులు వారిని అడ్డగించి చర్చలు జరిపారు. దీనిపై కలెక్టర్‌ సమావేశం చర్చలు జరిపి హామీ ఇచ్చారు. అయినప్పటికీ సరైన పరిష్కారం లభించలేదు.

ఇలావుండగా మంగళవారం ఆ ప్రాంతంలో 300 మంది పోలీసుల భద్రతతో పవర్‌గ్రిడ్‌ సంస్థ సిబ్బంది పనులు చేపట్టేందుకు వెళ్లారు. దీంతో ఆగ్రహించిన రైతులు మహిళలతో కలెక్టరేట్‌ చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. ఆ సమయంలో మహిళలు పసుపు కొమ్ములు కట్టిన తాళిబొట్లతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి కుమార్,  ఉద్యమకారుడు పళనిస్వామి పాల్గొన్నారు. దీంతో ఆర్‌డీఓ కవితా అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. తర్వాత పది మందిని మాత్రం కలెక్టర్‌ను కలిసేందుకు అనుమతినిచ్చారు. తర్వాత కలెక్టర్‌తో వారు చర్చలు జరిపారు. ఆందోళన జరపడం మంచిది కాదని కలెక్టర్‌ తెలిపారని, దీంతో విద్యుత్‌ టవర్లు ఏర్పాటుచేస్తే అడ్డుకుంటామని అన్నారు.

మరిన్ని వార్తలు