కెప్టెన్‌ను సీఎం చేస్తాం

10 Jan, 2016 10:06 IST|Sakshi
కెప్టెన్‌ను సీఎం చేస్తాం

అన్నాడీఎంకేకు బుద్ధి చెప్పాలి
విజయకాంత్‌కే ఎన్నికలపై నిర్ణయాధికారం
♦  డీఎండీకే జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం
 చెన్నై, సాక్షి ప్రతినిధి:
తమ పార్టీని కాలరాసేందుకు ప్రయత్నించిన అన్నాడీఎంకేకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతూనే పార్టీ అధినేత విజయకాంత్‌ను ముఖ్యమంత్రిని చేసి తీరుతామని డీఎండీకే సమావేశంలో నేతలు శపథం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెరంబలూరులో డీఎండీకే కార్యవర్గ, సర్వసభ్య సమావేశాలను శనివారం నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు విజయకాంత్ సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా ఇద్దరికి మాత్రమే ప్రసంగించే అవకాశం కల్పించారు.
 
  ఆ తరువాత సర్వసభ్య సమావేశం సాగింది. ఈ రెండు సమావేశాల్లో ప్రసంగించిన నేతలంతా అన్నాడీఎంకేపై విమర్శలతో విరుచుకుపడ్డారు. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజా సమస్యలను విస్మరించిన అన్నాడీఎంకే ప్రభుత్వానికి ఇక పాలించే హక్కులేదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు వీలులేకుండా ప్రతిపక్షాల గొంతునొక్కడం ఈ ప్రభుత్వ నైజమని అన్నారు. తమతో పొత్తువల్లనే గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా ఆ తరువాత తమను విస్మరించిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే గుణపాఠం చెప్పేలా కూటమి ఏర్పరచుకోవాలని పార్టీ నేతలు కోరారు.
 
 తమ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునేందుకు అన్నాడీఎంకే కుటిలయత్నాలను సాగిస్తోందని పార్టీకి చెందిన నేతలు తమ ప్రసంగాల్లో విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల చాంబర్లకు తాళాలు వేసి, అధికారిక కార్లను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని చాటుకుందని దుయ్యబట్టారు. అంతేగాక డీఎండీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లేడేందుకు వీలులేకుండా నిషేధం విధించిందని అన్నారు.
 
  తమ పార్టీ అధినేత విజయకాంత్‌పై అదేపనిగా పరువునష్టం దావాలు వేస్తూ వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. తమ పార్టీలో సీనియర్ నేత బన్రుట్టి రామచంద్రన్‌ను అన్నాడీఎంకేలో చేర్చుకోవడం ద్వారా ఇకపై భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తుపెట్టుకోకూడదని నేతలు అభిప్రాయపడ్డారు.2016లో ఏర్పడబోయే ఎన్నికల కూటములు, పార్టీ కార్యకలాపాలపై చర్చించారు.
 
 సర్వాధికారాల కెప్టెన్: పార్టీకే కాదు, అసెంబ్లీ ఎన్నికల నిర్ణయాలపై కూడా విజయకాంతే మా కెప్టెన్, ఆయనకు సర్వాధికారాలను కట్టబెడుతున్నామని డీఎండీకే జనరల్‌బాడీ సమావేశం తీర్మానించింది. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలని, ప్రజల కోర్కె మేరకు రాష్ట్రంలో సంపూర్ణమధ్య నిషేధం విధించాలని తీర్మానించారు. జల్లికట్టుకు అనుమతిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ, సాధించిన కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ తదితరులకు అభినందన తీర్మానాలు ఆమోదించారు.
 
  గ్రానైట్ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపేందుకు న్యాయస్తానాలే ముందుకు రావాలని కోరుతూ తీర్మానించారు. విద్యుత్ కోతల నుంచి విముక్తి కోసం హెచ్చుమొత్తాలు చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేయడాన్ని పార్టీ ఖండించింది. రాష్ట్రప్రభుత్వం అవినీతి అక్రమాలపై దోషులను శిక్షించేందుకు లోకాయుక్తను ఏర్పాటు చేయాలని తదితర తీర్మానాలు చేశారు. సభ ప్రారంభానికి ముందుగా పలు సంతాప తీర్మానాలు ఆమోదించారు.
 
  గత ఏడాది మరణించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్, గాంధేయవాది శశిపెరుమాళ్, వరదబాధితులు, మృతులకు సమావేశంలో ముందుగా శ్రద్ధాంజలి ఘటించారు.  పార్టీ అగ్రనేత ప్రేమలతా విజయకాంత్ 59 పార్టీ జిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు సహా 1550 మంది ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
 
 వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు వీలులేకుండా ప్రతిపక్షాల గొంతునొక్కడం ఈ ప్రభుత్వ నైజమని అన్నారు. తమతో పొత్తువల్లనే గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా ఆ తరువాత తమను విస్మరించిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే గుణపాఠం చెప్పేలా కూటమి ఏర్పరచుకోవాలని పార్టీ నేతలు కోరారు.తమ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునేందుకు అన్నాడీఎంకే కుటిలయత్నాలను సాగిస్తోందని పార్టీకి చెందిన నేతలు తమ ప్రసంగాల్లో విమర్శించారు.
 
  ప్రతిపక్ష ఎమ్మెల్యేల చాంబర్లకు తాళాలు వేసి, అధికారిక కార్లను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని చాటుకుందని దుయ్యబట్టారు. అంతేగాక డీఎండీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లేడేందుకు వీలులేకుండా నిషేధం విధించిందని అన్నారు. తమ పార్టీ అధినేత విజయకాంత్‌పై అదేపనిగా పరువునష్టం దావాలు వేస్తూ వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. తమ పార్టీలో సీనియర్ నేత బన్రుట్టి రామచంద్రన్‌ను అన్నాడీఎంకేలో చేర్చుకోవడం ద్వారా ఇకపై భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తుపెట్టుకోకూడదని నేతలు అభిప్రాయపడ్డారు.2016లో ఏర్పడబోయే ఎన్నికల కూటములు, పార్టీ కార్యకలాపాలపై చర్చించారు.
 
 
 సర్వాధికారాల కెప్టెన్: పార్టీకే కాదు, అసెంబ్లీ ఎన్నికల నిర్ణయాలపై కూడా విజయకాంతే మా కెప్టెన్, ఆయనకు సర్వాధికారాలను కట్టబెడుతున్నామని డీఎండీకే జనరల్‌బాడీ సమావేశం తీర్మానించింది. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలని, ప్రజల కోర్కె మేరకు రాష్ట్రంలో సంపూర్ణమధ్య నిషేధం విధించాలని తీర్మానించారు. జల్లికట్టుకు అనుమతిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ, సాధించిన కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ తదితరులకు అభినందన తీర్మానాలు ఆమోదించారు. గ్రానైట్ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపేందుకు న్యాయస్తానాలే ముందుకు రావాలని కోరుతూ తీర్మానించారు. విద్యుత్ కోతల నుంచి విముక్తి కోసం హెచ్చుమొత్తాలు చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేయడాన్ని పార్టీ ఖండించింది.
 
  రాష్ట్రప్రభుత్వం అవినీతి అక్రమాలపై దోషులను శిక్షించేందుకు లోకాయుక్తను ఏర్పాటు చేయాలని తదితర తీర్మానాలు చేశారు. సభ ప్రారంభానికి ముందుగా పలు సంతాప తీర్మానాలు ఆమోదించారు. గత ఏడాది మరణించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్, గాంధేయవాది శశిపెరుమాళ్, వరదబాధితులు, మృతులకు సమావేశంలో ముందుగా శ్రద్ధాంజలి ఘటించారు.  పార్టీ అగ్రనేత ప్రేమలతా విజయకాంత్ 59 పార్టీ జిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు సహా 1550 మంది ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు