పరీక్షలు రాయడానికి ఊరేగించి పంపారు.

30 Mar, 2017 17:37 IST|Sakshi
బొమ్మనహళ్లి: పరీక్షరాయడానికి వెళ్తూన్నారు..అంటే పెన్ను ఇవ్వడం. లేదా ఆశీర్వదించి పంపడం చూసుంటాం..కాని అందుకు భిన్నంగా ఈ ఊరి జనం చేశారు..వారి ఊరి పిల్లలు పదో తరగతి పరీక్షలు రాయడానికి వెళ్తున్నారని, వారు విద్యార్థులలో ఉండే భయాన్ని పోగోటాలనే ఉద్దేశ్యంతో గురువారం బాగలకోట జిల్లాలోని సంగానట్టి గ్రామంలో ఉన్న ప్రజలు, ఎస్ డీఎంసీ సభ్యులు విద్యార్థులను గ్రామంలో ఊరేగించి, వారి మెడలో పూలమాలలు వేసి దారి పొడవునా వారి పైన పూల వర్షం కురిపించారు.
 
ఇలా చెయ్యడం ద్వారా విద్యార్థులలో పరీక్షల మీదున్న భయం పోయి వారు పరీక్షలు బాగా రాస్తారని చెబుతున్నారు. ఇంతే కాకుండా ఎవరయితే 95 శాతం మార్కులు సాధిస్తారో వారి పేరును ఊరిలో ఉన్న రోడ్డుకు పెడతామని బహిరంగంగా ప్రకటించారు. అచ్చం ఈ సంఘటన నటుడు సుధీప్ నటించిన రంగ ఎస్ఎస్ఎల్ సీ సినిమాలో ఉందని గ్రామాస్తులు గుర్తుచేసుకున్నారు. 
మరిన్ని వార్తలు