అరచేతిలో అశ్లీలం

17 Nov, 2017 09:37 IST|Sakshi

తప్పుదారి పడుతున్న   విద్యార్థులు

మోసపోతున్న యువతులు

బరంపురం: ఆధునిక గ్లోబలైజేషన్‌ యుగంలో పెరిగిన టెక్నాలజీ ఒకవైపు ఉపయోగం, మరోవైపు అపకారాన్ని తలపెడుతోంది. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉండే అధునిక పరిజ్ఞానం కొంతమందికి మంచికి ఉపయోగపడుతుంటే మరి కొంత మందికి చెడు సావాసాలకు దారి తీస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చిన స్మా ర్ట్‌ ఫోన్‌ల కారణంగా అరచేతిలో అశ్లీల చిత్రాలు, అసభ్య వీడియోలతో కొంతమంది యువకులు వారి బంగారు భవిష్యత్తును దూరం చేసుకుంటున్నారు. ప్రస్తుతం గంజాం జిల్లాలో జరిగిన పలు సంఘటనలు సంచలనం రేపుతున్నాయి. జిల్లాలో కొంతమంది యువకులు ప్రేమ పేరుతో వంచించి మొబైల్‌ ఫోన్లలో ప్రే యసుల అభ్యంతరకర(నగ్న) చిత్రాలు   చిత్రీకరిస్తూ వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ కీలు బొమ్మ ల్లా ఆడిస్తునట్లు జిల్లాలో గల పలు పోలీసు స్టేషన్‌లలో నమోదవుతున్న కేసులే రూజువు చేçస్తున్నాయి.

సెల్‌ఫోన్లలో నెట్‌ ద్వారా అశ్లీచి త్రాలు డౌన్‌లోడ్‌ చేయడం, స్మార్ట్‌ఫోన్‌లలో నెట్‌ ప్యాకేజీతో నేరుగా అరచేతిలో అశ్లీల చిత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవడంపై  కొంతమంది యువకులు ఎక్కుగా అసక్తి చూపుతున్నారు. అంతేకా కుండా ఇతరులకు ఇబ్బందికర చిత్రాలను వా ట్సాప్‌లలో పంపుతున్నట్లు బాధితుల నుంచి   బరంపురం పోలీస్‌ మండలి పరిధిలో గల వివి ధ పోలీసు స్టేషన్‌లలో  ఫిర్యాదులు అందుతు న్న నమోదవుతున్న కేసులతో రుజవవుతోంది. 

తక్కువ ఖరీదుకే కెమెరా ఫోన్లు
బజారులో అతి తక్కువ ఖరీదుకే కెమెరా, వీడియోతో ఉన్న చైనా సెట్‌లు లభిస్తున్నాయి. దీంతో కొంత మంది యువకులు సెల్‌ఫోన్ల ద్వారా అర చేతిలో అశ్లీల చిత్రాలు చూస్తూ అడ్డుదారి తొక్కుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఒకవైపు నేటి యువతరాన్ని మాదకద్రవ్యాల మత్తు పీడిస్తుంటే మరోవైపు కొత్త సమస్యగా సెల్‌ఫోన్లలో అసభ్య చిత్రాలు, వీడియోలు చూస్తూ  తప్పుదారి పడుతున్నట్లు ఒక పోలీస్‌ ఉన్నతాధికారి తెలియజేస్తున్నారు. మరికొంత మంది అకతాయి యువకులు ప్రేమ పేరుతో యువతులను వంచించి ఫోన్ల ద్వారా అభ్యంతరకర చిత్రాలు, వీడియో క్లిపింగ్‌లను తీసి ఆ యువతుల తల్లిదండ్రులకు చూపి బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు గుంజుతున్న సందర్భాలు లేకపొలేదని, మరికొంత మంది ప్రేయసి అభ్యంతరకర చిత్రాలు చిత్రీకరించి చెప్పినట్లు చేయక పోతే ఇతరులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పంపిస్తామని బెదిరిస్తూ యువతులను బెదిరిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నట్లు  ఇటీవల నగరమంతా సంచలనం రేగిన వాట్సాప్‌ చిత్రాలు, వీడియోల్లో వచ్చిన క్లిప్పింగ్‌ ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇదేవిధంగా జిల్లాలోని పురుషోత్తంపూర్‌ గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమపేరుతో వంచించి సెల్‌లో అభ్యంతరకర చిత్రాలు తీసి ఇతరుల మొబైల్‌ ఫోన్లకు  ఎంఎంఎస్‌ల ద్వారా పంపడం జిల్లావ్యాప్తంగా సంచలనం రేపింది. జరిగిన సంఘటనపై పురుషోత్తంపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా ఆ యువకుని అరెస్ట్‌ చేసి జైలుకి పంపించారు.

ఇదేవిధంగా కొన్ని నెలల క్రితం నీస్ట్‌ కళాశాల విద్యార్థినిని అదే కళాశాల విద్యార్థి ప్రేమ పేరుతో వంచించి అభ్యంతరకర క్లిప్పింగ్‌లు చిత్రీకరించి ఏకంగా నెట్‌లో పెట్టడంతో బరంపురంలో సంచలనం రేగింది. ఆ యువతి తల్లి దండ్రులు కేసు పెట్టడంతో టౌన్‌ పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్‌   చేసి జైలుకు తరలించారు. ఈ విధంగా బయటపడినవి కొన్నైతే  బయట పడనివి ఎన్నో ఉన్నట్లు పోలీస్‌ అధికారులు తెలియజేస్తున్నారు.

పటిష్టంగా  సైబర్‌ నేరాల చట్టం
గంజాం జిల్లాలో  అకతాయి రోమియోలు ఎక్కువయ్యారని యువతులు  జాగ్రత్తగా ఉండాలని  పోలీస్‌ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల పట్ల ఒక కన్ను వేసి వారి నడవడికలపై దృష్టిసారించాలని కోరుతున్నారు.  గంజాం జిల్లాలో ఇటీవల పెరుగుతున్న సైబర్‌ నేరాల పట్ల రాష్ట్ర హోం శాఖ దృష్టిసారించి గంజాం జిల్లాలోని బరంపురం పోలీస్‌ మండలి, గంజాం పోలీసు మండలిలో ప్రత్యేకంగా రెండు సైబర్‌ పోలీసు స్టేషన్‌లు తెరిచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌   ఇచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు