వైఎస్ జగన్ తూర్పుగోదావరి పర్యటన వాయిదా

14 Nov, 2016 17:55 IST|Sakshi
వైఎస్ జగన్ తూర్పుగోదావరి పర్యటన వాయిదా
కాకినాడ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 17న జిల్లాలోని తొండంగి దివీస్ ప్రభావిత గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటించాల్సి ఉంది. కాగా అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన వాయిదా పడింది. ఈ నెల 22 న ఆయా గ్రామాల్లో జగన్ పర్యటించి దివీస్ వ్యతిరేక ఉద్యమానికి మద్ధతు ఇవ్వనున్నారు. అదే విధంగా దివీస్ ఉద్యమంలో గాయపడ్డ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్టు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తెలిపారు.
 
కాగా తొండంగి మండలం కోన తీరప్రాంతంలో దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామాల రైతులు ఆ భూముల్లోకి ప్రవేశించి పనులను అడ్డుకున్న విషయం తెలిసిందే. దానవాయిపేట పంచాయతీ కొత్తపాకలు గ్రామంలో ప్రభుత్వం దివీస్ లేబొరేటరీస్‌కు 505 ఎకరాలు కేటాయించింది. ఇటీవల రెవెన్యూ అధికారులు ఎకరాకు రూ.5 లక్షల పరిహారం చెల్లించి కొంతమంది రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే ఈ పరిశ్రమ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, గాలి, నీరు, నేల కలుషితమై తీరప్రాంత గ్రామాల మనుగడ దెబ్బ తింటుందని పేర్కొంటూ.. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు భూములిచ్చేది లేదంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మరిన్ని వార్తలు