వేలూరు జైలుకు యువరాజు

26 Aug, 2016 01:51 IST|Sakshi
వేలూరు జైలుకు యువరాజు

వేలూరు: నామక్కల్ డీఎస్పీ విష్ణుప్రియ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యువరాజ్‌ను గురువారం మధ్యాహ్నం వేలూరు సెంట్రల్ జైలుకు పో లీసులు పటిష్ట బందోబస్తు నడుమ తీ సుకొచ్చారు. సేలం జిల్లా ఓమలూర్‌కు చెందిన గోకుల్‌రాజ్ ఇంజినీరింగ్ పట్ట భద్రుడు. ఇతను తిరిచ్చింగేడు ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. ప్రియురాలితో కలిసి గోకుల్ రాజ్ ఆల యానికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీ నికి సంబంధించి సేలం జిల్లా శంగారి యాకు చెందిన దీరన్ చిన్నమలై పేరవై సంస్థ అధ్యక్షులు యువరాజ్ గత అక్టోబర్‌లో  సీబీసీఐడీ పోలీసుల వద్ద లొంగి పోయారు.
 
 దీంతో  పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి వేలూరు సెంట్రల్ జైలులో ఉంచారు.  దీనిపై యువరాజ్ మద్రాసు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చే శాడు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో నిబంధన బెయిల్‌లో బయటకు వచ్చిన యువరాజ్ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు, చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో మహిళా ఇంజినీర్ స్వాతి హత్య చేసిన సమయంలో వీటిపై యువరాజ్ ఒక కులానికి చెందిన వారికి ఈ కేసులో సంబంధం ఉన్నట్లు సంచలన వాఖ్యలు చేశారు. దీంతో యువరాజ్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో కేసు అప్పీలు చేశారు.
 
 ఈ కేసును విచారించిన న్యాయమూర్తి యువరాజ్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ బుధవారం తీర్పునిచ్చారు. దీంతో చెన్నై కీల్‌పాక్కం ప్రయివేటు హోటల్‌లో ఉన్న యువరాజ్‌ను సీబీసీఐడీ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ వ్యాన్‌లో నామక్కల్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం గురువారం ఉదయం 8 గంటల సమయంలో నామక్కల్‌లోని న్యాయమూర్తి ముందు పోలీసులు యువరాజ్‌ను హాజరు పరిచారు. విచారించిన న్యాయమూర్తి యువరాజ్‌ను సెప్టెంబర్ 8 వరకు వేలూరు సెంట్రల్ జైల్లో ఉంచాలని తీర్పునిచ్చారు. దీంతో పోలీసులు పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ యువరాజ్‌ను వేలూరు సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు.
 

మరిన్ని వార్తలు