వాయు పుత్రుడికి భారీ వడ మాల

18 Dec, 2017 01:49 IST|Sakshi

తమిళనాడులోని నామక్కల్‌లో ఘనంగా హనుమ జయంతి  

సేలం (తమిళనాడు): తమిళనాడులోని సేలం జిల్లా నామక్కల్‌ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేసి లక్షా ఎనిమిది వడలతో రూపొందించిన మాలతో అలంకరించారు. నామక్కల్‌ కోటలో అతి పురాతనమైన 18 అడుగుల ఎల్తైన శ్రీ ఆంజనేయ స్వామి ఏక శిలా విగ్రహం ఉంది.

స్వామికి ప్రతి ఏడాది మార్గశిర నెల తొలి నక్షత్రం రోజున జయంతి వేడుకలను నిర్వహి స్తారు. ఆదివారం వేకువజామున 3.00 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. 5.00 గంటలకు లక్షా ఎనిమిది వడల తో రూపొందించిన మాలను అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం 11 గంటలకు విశేష అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటలకు ఆంజనేయ స్వామికి ముత్తంగి అలంకరణ చేశారు.

మరిన్ని వార్తలు