ప్రేమోన్మాదం 

3 Sep, 2019 21:06 IST|Sakshi

పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి సజీవదహనం

అడ్డొచ్చిన వారిని వదలిపెట్టని కిరాతకం

తీవ్రగాయాలతో ఆస్పత్రిలో తల్లి, చెల్లి 8 ఆదంబాక్కంలో కలకలం

ప్రేమ పేరుతో రాష్ట్రంలో వేధింపులు, కిరాతకాలు నానాటికీ పెరుగుతున్నాయి. వన్‌సైడ్‌ ప్రేమ అంటూ కొందరు.. తనను విస్మరించిందంటూ మరికొందరు.. తనకు దక్కనిది మరొకరికి దక్క కూడదంటూ ఇంకొందరు యువకులు  ప్రేమోన్మాదులుగా మారుతున్నారు. ఈ పరిణామాలు వెరసి యువతులకు రాష్ట్రంలో భద్రత కరువైన పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు యువత ఒడిగడుతున్న ఘాతుకాలు మరింత కిరాతకంగా ఉంటున్నాయి. గత ఏడాది కాలంలో పదిమంది యువతులు ఒన్‌సైడ్‌ ప్రేమకు ఉన్మాదుల చేతిలో బలయ్యారు.

అలాగే, తనను విస్మరించారనే నెపంతో ఉన్మాదుల ఆగ్రహానికి మరో ఆరుగురు యువతులు బలికాక తప్పలేదు. ఇందులో కారైక్కాల్‌ వినోదిని, చెన్నైలో విద్య, సోనియా, కరూర్‌లో సోనాలి, తూత్తుకుడిలో టీచర్‌ ప్రాన్సీన, కోవైలో ధన్య, చెన్నై నుంగంబాక్కంలో స్వాతి, అంబత్తూరులో మైథిలి వంటి వారు  ఎందరో ఉన్నారు. తాజాగా, తనకు దక్కనిది మరొరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ఇందుజాను కిరాతక ప్రియుడు సజీవ దహనంచేశాడు. ఈ తరహా ఉన్మాద ఘటనలు తల్లిదండ్రుల్ని కలవరంలో పడేస్తున్నాయి.

సాక్షి, చెన్నై : ఆ ఇద్దరు పాఠశాల స్థాయిలో మిత్రులు. కళాశాల స్థాయికి ఎదగడంతో మిత్రులు ప్రేమికులయ్యారు. చెన్నై నగరంలో  చెట్టాపట్టలేసుకుని తిరిగారు. ప్రియురాలి ఇంటికి వెళ్లడమే కాదు, ఆ ఇంట్లో తానూ ఒకడే అనుకుని సపర్యలు చేశాడు. పీకల్లోతు ప్రేమలో మునిగి చదువును అటకెక్కించాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ‘చదువు, ఉద్యోగం సద్యోగం లేని వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి..?’  అని ప్రియురాలు, ఆమె తల్లి ప్రశ్నించారు. ఆ ప్రియుడు ప్రేమోన్మాదిగా మారాడు. ఆరేళ్లు అమితంగా తాను  ప్రేమించిన యువతిని సజీవ దహనం చేసి కిరాతకుడయ్యాడు.  తనకు దక్కని ప్రియురాలు ఇంకెవరికీ దక్కకూడదనే ఉన్మాదంతో ఆ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తమ ఎదుటే  పెట్రోలు పోసి తగులబెడుతుంటే అడ్డొచ్చిన ఆ యువతి తల్లి, చెల్లిపైనా పోసి నిప్పంటించాడు.  

చెన్నైలోని ఆదంబాక్కంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సేలంకు చెందిన షణ్ముగం(50), రేణుక(42) దంపతుల కుటుంబం కొన్నేళ్ల క్రితం చెన్నై ఆదంబాక్కం సరస్వతి నగర్‌ ఏడో వీధిలో స్థిర పడింది. వీరికి కుమార్తెలు ఇందుజా(22), నివేద(20), కుమారుడు మనోజ్‌(15) ఉన్నారు. పెద్దకుమార్తె ఇందుజా గిండిలోని ఓ ప్రముఖ స్కూల్‌లో పాఠశాల చదువును ముగించింది. ఈ సమయంలో వేళచ్చేరికి చెందిన ముత్తుకుమార్‌ కుమారుడు ఆకాష్‌(24)తో స్నేహం ఏర్పడింది. తామే బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అన్నట్టుగా మెలిగారు. ప్లస్‌ ఒన్‌లోనే ఈ ఇద్దరు ఒకర్ని మరొకరు ఇష్టపడే రీతిలో వ్యవహరించారు. ప్లస్‌టూ ముగియగానే ఇందుజా బీటెక్‌ , ఆకాష్‌ డిప్లొమో కోర్సులపై దృష్టి పెట్టారు. వీరిద్దరి కళాశాలలు వేరైనా స్నేహం మాత్రం కొనసాగింది. కాల క్రమేణా మిత్రులు ప్రేమికులయ్యారు. 

ప్రేమికులుగా..
ఆకాష్, ఇందుజా కళాశాల జీవితంలోకి అడుగు పెట్టిన నంతరం ప్రేమ పక్షుల్లా ఇద్దరూ పెద్దల కళ్లు గప్పి చెన్నైలో చెట్టాపట్టలేసుకుని తిరగని ప్రదేశం అంటూ లేదని చెప్పవచ్చు.  పీకల్లోతు ప్రేమలో మునిగినా, ఇందుజా మాత్రం తన దృష్టిని చదువుల మీదే పెట్టింది. అయితే, ఆకాష్‌ చదువును అటకెక్కించాడు. తన ఇంటికి ఆకాష్‌ వచ్చి వెళ్లేంతగా చనువును ఇందుజా పెంచుకుంది. ఇందుజా తండ్రి బెంగళూరుకు బదిలీ కావడంతో  వీరికి అడ్డు అన్న వారే లేరు.  ఆ ఇద్దరు స్కూల్‌మెట్సే కదా.. అనుకుని తల్లి రేణుక ఎన్నడూ ఖండించలేదు.  దీనిని అదనుగా తీసుకున్న ఆకాష్‌ ఆ కుటుంబానికి దగ్గరై తలలో నాలుకలా మారాడు.  ఆ ఇంటికి కావాల్సినవన్నీ తానే స్వయంగా వెళ్లి తీసుకొచ్చే వాడు. 

కథ అడ్డం తిరిగింది
ఓ దశలో రేణుకతో ఇందుజాను తనకు ఇచ్చి వివాహం జరిపించాలన్నట్టు ఆకాష్‌ చమత్కారంతో  ప్రతిపాదన తీసుకొచ్చినా, ఆమె చిన్న పిల్లల చేష్టలుగా పరిగణించి పెద్దగా పట్టించుకోకుండా మరో తప్పుచేసింది.  ఆరు నెలల క్రితం బీటెక్‌ ముగించిన ఇందుజా తరమణిలోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగాన్ని దక్కించుకుంది. తనకు  ఉద్యోగం వచ్చిన రెండు నెలలకు ఆకాష్‌తో ప్రేమ విషయాన్ని తల్లి రేణుక దృష్టికి తీసుకెళ్లింది. ఇందుకు ఆమె నిరాకరించడంతో కథ అడ్డం తిరిగింది. అప్పటివరకు ఆ  ఇంటికి స్వేచ్ఛగా వచ్చే ఆకాష్‌కు తదుపరి తలుపులు తెరచుకోలేదు. మానసికంగా కుంగిన అతను ఇందుజా కోసం పరితపించడం మొదలెట్టాడు. 

ప్రేమోన్మాదిగా..
ఆరేళ్ల ప్రేమ పరిచయంలో నాలుగేళ్లుగా తనతో ప్రతి గంటకు ఓసారి ఫోన్లో మాట్లాడటం లేదా, వాట్సాప్‌లో చాటింగ్‌ వచ్చే ఇందుజా తనను దూరం పెట్టడంతో కుంగిపోయాడు. ఆమెను కలిసేందుకు శతవిధాలుగా ప్రయత్నించాడు. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితం అతి కష్టం మీద సంప్రదించగా,  చదువును అటకెక్కించి, ఉద్యోగం, సద్యోగం లేకుండా తిరిగేవాడిని పెళ్లి చేసుకోవాలా..? అని తన తల్లి రేణుక ప్రశ్నిస్తోందని, ఇక తనకు దూరంగా ఉండమని ఇందుజా హెచ్చరించింది. ఆ తర్వాత అను పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లి తల్లి రేణుకను ప్రాధేయపడ్డా ఫలితం శూన్యం. ప్రేమోన్మాదిగా మారిన ఆకాష్‌ రెండు రోజుల క్రితం సహచర ఉద్యోగి ఒకరితో ఇందుజా సన్నిహితంగా ఉండడాన్ని చూశాడు. దీంతో తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్నంతగా ఉన్మాది అయ్యాడు. 

పెట్రోల్‌ పోసి నిప్పంటించి..
చివరి ప్రయత్నం లేదా, హతమార్చడం లక్ష్యంగా పథకంతో సోమవారం రాత్రి ఆకాష్‌ ఆదంబాక్కంకు చేరుకున్నాడు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో తలుపు తట్టగా, రేణుక వచ్చింది. ఆమెను చివరి ప్రయత్నంగా ప్రాధేయపడ్డాడు. ఫలితం శూన్యం. కులం అడ్డుగా ఉందని, ఉద్యోగం సద్యోగం లేని వాడికి ఇచ్చి ఎలా పెళ్లి చేయాలన్నట్టుగా ఆమె ప్రశ్నించడం, అదే సమయంలో ఇందుజా సైతం అక్కడికి వచ్చిన హెచ్చరించడంతో తనలోని ఉన్మాదిని ఆకాష్‌ బయటకుతీశాడు. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ముందుగా అక్కడ దాచిన పెట్టిన క్యాన్‌ను తీసుకుని క్షణాల్లో ఇంట్లోకి మళ్లీ దూరాడు. ఇందుజా మీద ఆ క్యాన్‌లో ఉన్న ద్రవాన్ని పోశాడు. అడ్డు వచ్చిన రేణుక, నివేదల మీద పోసి లైటర్‌తో నిప్పు పెట్టాడు. పెట్రోల్‌ కలిపిన టర్బన్‌ టైల్‌ ఆయిల్‌ను పోసిన దృష్ట్యా, క్షణాల్లో ఆ ముగ్గుర్ని మంటలు ఆవహించాయి. బెడ్‌రూమ్‌లో ఉన్న ఇందుజా సోదరుడు మనోజ్‌ బయటకు వచ్చేలోపు ఆకాష్‌ ఉడాయించాడు.

సంఘటన స్థలంలోనే సజీవదహనం
రేణుక ఇంటి నుంచి  కేకల్ని విన్న కింది ఫ్లోర్‌లోని రామ్‌కుమార్‌ పైకి పరుగులు తీశాడు. మంటల్లో కాలుతున్న వారిని రక్షించే యత్నంచేశాడు. ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. రేణుక, నివేదల్ని చుట్టుముట్టిన మంటల్ని ఆర్పారు. అయితే, ఇందుజ అక్కడే సజీవదహనమైంది. సమాచారం అందుకున్న ఆదంబాక్కం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ రేణుక, నివేదలను కీల్పాకం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేదని, అయితే,  ఆ కుటుంబంలో చోటుచేసుకున్న తాజా ఘటనతో ఇరుగుపొరుగు వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు
అజ్ఞాతంలోకి వెళ్లిన ఆకాష్‌ కోసం పోలీసులు  రాత్రంతా గాలించారు. చివరకు మంగళవారం ఉదయాన్నే అతను ఆదంబాక్కం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన ప్రేమ పయనం నుంచి ఉన్మాదం వరకు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చి నేరాన్ని అంగీకరించాడు. తనకు దక్కనిది మరొకరికి దక్క కూడదని, తనను మోసం చేశారంటూ అందుకే సజీవదహనం చేశానంటూ చేసిన తప్పును కిరాతక ప్రేమికుడు సమర్థించుకునే యత్నం చేయడం గమనార్హం. 
 

Read latest Tamil-nadu News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చెన్నైలో తెలంగాణ ఆటగాళ్ల అరెస్ట్‌

హెల్మెట్‌ లేదంటూ కారు యజమానికి జరిమానా

చొక్కా కోసం కోర్టుకెళ్లాడు...

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

సోదరుడిని పరామర్శించిన రజనీకాంత్‌

తమిళనాడులో బాంబు పేలుడు, ఇద్దరు మృతి

కాపీ డే వీజీ సిద్దార్థ తండ్రి మృతి

పురుడు పోసిన మహిళా పోలీసులు

ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం ఉందా!

ఈడీ ముందుకు ఠాక్రే‌, ముంబైలో టెన్షన్‌

మాస్తిగుడి కేసు: ఐదుగురి అర్జీలు తిరస్కరణ

ఆడ శిశువును అమ్మబోయిన తల్లి

కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

తలైవా రాజకీయ తెరంగేట్రానికి ముహూర్తం..?

హెల్మెట్‌ ధరించకుంటే రూ.1000 జరిమానా

పెళ్లిళ్లకు వరద గండం

నళిని కుమార్తె ఇండియా రాకలో ఆలస్యం

ఆ వృద్ధ దంపతులకు ప్రభుత్వ పురస్కారం

సీఎం ప్రారంభించిన 50 రోజులకే...

వెయిట్‌ అండ్‌ సీ : రజనీకాంత్‌

చిరకాల స్వప్నం.. సివిల్స్‌లో విజేతను చేసింది

‘బిర్యానీ తినడానికి టైమ్‌ ఉంది కానీ..’

ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి రాఖీలు..

అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

లెక్కలు చూపని రూ. 700 కోట్ల గుర్తింపు

సముద్రాన్ని తలపిస్తున్న ఊటీ

ఎంపీ సుమలత ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్‌

బళ్లారి ముద్దుబిడ్డ

అయ్యో.. ఘోర రోడ్డు ప్రమాదం

లక్షలు పలికే పొట్టేళ్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘వాల్మీకి’లో సుకుమార్‌!

ఆయన సినిమాలో నటిస్తే చాలు : అలియా భట్‌

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?

ఆ కీర్తి ఎంతో కాలం నిలవదు.. తాత్కాలికమే!

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం

అతిలోక సుందరికి అరుదైన గౌరవం