డెంగీ జ్వరాలు.. 20వేల మందికి నోటీసులు

10 Oct, 2017 19:21 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో డెంగీ వ్యాప్తికి కారకులైన 20 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ మంగళవారం నోటీసులు జారీచేసింది. దుకాణాలు, ఇళ్లు, ఇంటి ఖాళీ స్థలాల్లో మురుగునీటి గుంతలతో పారిశుద్ద్యాన్ని భంగపరిచేలా వ్యవహరిస్తున్న 20 వేల మందికి ఈ నోటీసులు అందాయి.

గత రెండు నెలల కాలంలో డెంగీ జ్వరాల బారిన పడి వందల సంఖ్యలో మృత్యువాత పడగా, పదివేల మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగీ దోమలతో నిండి ఉన్న 20 వేల మురుగు నీటి గుంతలను గుర్తించిన ప్రభుత్వం.. 48 గంటల్లోగా వాటిని తొలగించకుంటే ఆరు నెలల జైలుశిక్ష తప్పదని సంబంధిత యాజమాన్యాలను హెచ్చరించింది.

మరిన్ని వార్తలు