చేపల వలలో పంచలోహ విగ్రహం

13 Jan, 2018 10:38 IST|Sakshi

సాక్షి, అన్నానగర్‌(చెన్నై): మూడేళ్ల క్రితం చోరీకి గురైన 45 కిలోల పంచలోహ విగ్రహం జాలర్ల వలకు చిక్కింది. ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు..తిరువణ్ణామలై జిల్లా బోలూర్‌ అల్లినగర్‌కి చెందిన ముత్తుకుమరన్‌(32) జాలరి. ఇతను శుక్రవారం బోలైఊర్‌ కూల్‌ నదిలో చేపలు పట్టేందుకు నదిలో వల వేశాడు.

అప్పుడు వల బరువుగా ఉండడంతో కష్టంగా పైకి లాగాడు. ఆ వలలో ఓ మూట వచ్చింది. మృతదేహం ఉందేమోనని భయపడి వెంటనే బోలూర్‌ పోలీసుస్టేషన్‌కి సమాచారం అందించాడు. ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌బాబు, పోలీసులు అక్కడికి వచ్చి మూటను తెరచి చూశారు. అందులో 45 కిలోల బరువైన అమ్మవారి పంచలోహ విగ్రహం ఉంది. పోలీసులు ఆ విగ్రహాన్ని బోలూర్‌ తహసీల్దార్‌కు అప్పగించారు. ఈ విగ్రహం మూడేళ్ల క్రితం వసూర్‌ గ్రామంలోని చెల్లియమ్మన్‌ ఆలయం నుంచి చోరీ చేశారని పోలీసుల విచారణలో తెలిసింది.  

మరిన్ని వార్తలు