ఐఫోన్ ఉండగా.. తాళం చెవి దండగ!

23 Jun, 2020 13:44 IST|Sakshi

వాషింగ్టన్: మీ కారు డోర్ తీయడానికి తాళం చెవులకు బదులు ఐఫోన్ వాడితే ఎలా ఉంటుంది? అరే.. తాళాలు మర్చిపోయాం అనే బెంగ ఉండదంటారా! అచ్చూ ఇలానే ఆలోచించారనుకుంటా యాపిల్ డెవలపర్స్. కారు తాళం చెవుల స్థానాన్ని ఐఫోన్ తో భర్తీ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేసేస్తున్నారు. (యాపిల్ ఐఫోన్12 ఫైనల్ లుక్?)

సోమవారం యాపిల్ నిర్వహించిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఈ ఫీచర్ ను బయటకు చూపించారు. 2021లో బీఎండబ్ల్యూ 5 సిరీస్ కార్లలో ఈ ఫీచర్‌ను యాపిల్ యాడ్ చేయబోతోంది. అతి త్వరలో మిగతా మోడల్స్‌కు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. దగ్గర నుంచి కాకుండా దూరం నుంచి కూడా ఫోన్‌ను చూపితే డోర్ తెరుచుకునేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. (ట్రెండింగ్‌లో ఇండియ‌న్ యాప్‌)

మరిన్ని వార్తలు