ఫోన్​తో పాటు ఇక చార్జర్​ రాదు!

9 Jul, 2020 12:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ఫోన్​ కొన్నప్పుడు బాక్సులో ఇకపై చార్జర్​ ఉండదు! అవును. యాపిల్​, శాంసంగ్​ సంస్ధలు ఈ దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మొబైల్స్​ బాక్సుల్లో ఇయర్​ ఫోన్స్​ ఇవ్వడాన్ని నిలిపేసిన ఈ సంస్ధల కన్ను ఇప్పుడిక చార్జర్లపై పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి వచ్చే కొన్ని ఫోన్ల బాక్సుల్లో చార్జర్లు లేకుండా పంపాలని శాంసంగ్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. (‘నేను అమెరికాకు ఎలా వెళ్లగలను?’)

యాపిల్​ ఈ ఏడాదిలో తెచ్చే కొత్త తరం మొబైల్స్​ నుంచే చార్జర్లు లేకుండా హ్యాండ్​ సెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు టెక్​ వర్గాల బొగట్టా. వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇరు కంపెనీలు ఈ నిర్ణయానికి వచ్చాయని తెలిసింది.

ప్రస్తుతం యాపిల్​ ఐదు వాట్లు, 18 వాట్లు సామర్ధ్యం కలిగిన చార్జర్లను మొబైల్స్​తో పాటు అందజేస్తోంది. వీటిని సాధ్యమైనంత త్వరగా నిలిపేసి, 20 వాట్ల సామర్ధ్యం కలిగిన ఒకే ఒక చార్జర్​ను మార్కెట్లోకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. (రెమిడిసివిర్‌కు తీవ్ర కొరత)

ఏదేమైనా రెండు కంపెనీలు తీసుకున్న నిర్ణయం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఫోన్ల ప్యాకేజింగ్​లో మార్పులు, రవాణాకు అయ్యే ఖర్చు, చార్జర్లను ఎక్కువగా తయారు చేయడం వల్ల ఉత్పత్తి అయ్యే ఈ వేస్ట్ గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. 

ఇప్పటికే అన్ని ఫోన్లకు ఒకే రకమైన చార్జింగ్ మెకానిజమ్​ ఉండే దిశగా యూఎస్​బీ–సీ టైప్​ను యాపిల్​, శాంసంగ్​, గూగుల్​, మోటరోలా, సోనీ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. 2021 నాటికి పూర్తి స్థాయిలో సీ టైప్​ చార్జింగ్ కలిగిన ఫోన్లను మాత్రమే ఈ కంపెనీలు ఉత్పత్తి చేస్తాయి.

మరి ఫోన్లకు చార్జర్​ ఎలా?
ఫోన్లను కొనుగోలు చేస్తున్న వివియోగదారులే చార్జర్లకు అయ్యే ఖర్చులను కూడా భరించాలని టెక్​ కంపెనీలు భావిస్తున్నాయి. అంటే ఫోన్​తో పాటు చార్జర్​ను ఎక్స్​ట్రాగా కొనుక్కోవాలన్నమాట. చాలామంది యూజర్లు కొత్త ఫోన్లను కొన్నా తమ వద్ద ఉన్న పాత చార్జర్లనే వాడుతున్నారు. కొందరు థర్డ్ పార్టీ బ్రాండ్స్​ ఏఎంఎక్స్​ ల్యాబ్స్​, యాంకెర్​ తదితర కంపెనీల మల్టీ చార్జర్లను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు