ఆసుస్‌ కొత్త ఫోన్‌, ఫోటోగ్రఫీ స్పెషల్‌

17 Aug, 2017 19:36 IST|Sakshi
ఆసుస్‌ కొత్త ఫోన్‌, ఫోటోగ్రఫీ స్పెషల్‌
తైవనీస్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఆసుస్‌ గురువారం ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఫోటోగ్రఫీ లవర్స్‌ కోసం డ్యూయల్‌ కెమెరా సెటప్‌తో 'జెన్‌ఫోన్‌ జూమ్‌ ఎస్‌' పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. దీని ధర 26,999 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు వెనుకవైపు 12 ఎంపీ డ్యూయల్‌ కెమెరా, ఫ్రంట్‌ వైపు 13 ఎంపీ కెమెరా ఉన్నాయి.. 2.3ఎక్స్‌ ఆప్టికల్‌, 12ఎక్స్‌ డిజిటల్‌ జూమ్‌ను ఇది కలిగి ఉంది. తక్కువ వెలుతురులో ఫోటోగ్రఫీ కోసం 'ఆసుస్‌ సూపర్‌పిక్సెల్‌ కెమెరా' ఫీచర్‌తో ఇది మార్కెట్‌లోకి వచ్చింది.
 
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆసుస్‌ ఇండియా కొత్త జెన్‌ఫోన్‌ జూమ్‌ ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తూ... ఫోటోగ్రఫీపై అభిరుచి కలిగిన ఔత్సాహికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఆసుస్‌ ఇండియా సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌, దక్షిణాసియా, దేశీయ అధినేత పీటర్‌ ఛాంగ్‌ చెప్పారు. ఈ ఫోన్‌ అత్యధికంగా 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యముంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే, రెండు రోజుల పాటు పనిచేయనుంది. రివర్స్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ను ఇది సపోర్టు చేస్తుంది.  క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625తో ఇది రూపొందింది. 
 
ఈ ఫోన్‌ మిగతా ఫీచర్లు...
5.50 అంగుళాల డిస్‌ప్లే
2 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌
64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్
ఆండ్రాయిడ్‌ 6.0
4కే లో వీడియోలు షూట్‌ చేసుకునే సదుపాయం
మరిన్ని వార్తలు