జియో ప్రైమ్‌ యూజర్లకు మరో బంపర్‌ ఆఫర్‌

8 Jul, 2017 16:52 IST|Sakshi
జియో ప్రైమ్‌ యూజర్లకు మరో బంపర్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ:  రిలయన్స్‌ జియో తన  ప్రైమ్‌ ఖాతాదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ అందిస్తోంది.  ముఖ్యంగా  దేశీయంగా  ఆసుస్ ఫోన్లను కొత్తగా కొన్న యూజర్లకు శుభవార్త.   రిలయన్స్ జియో తో భాగస్వామ్యంతో,   ఆసుస్‌ ఎడిషనల్‌ డేలా పేరుతో  ఒక పథకాన్ని అందిస్తోంది. తాజా ప్లాన్‌ ప్రకారం 10 రీఛార్జ్ లపై నెలకు 10జీబీ అదనపు డేటాను పొందవచ్చు. జూన్ 16, 2017,లేదా ఆ తరువాత అసుస్ స్మార్ట్‌ఫోన్లను కొన్న వారికి ఈ ఆఫర్ వర్తించనుంది.   వీరికి 10 నెలల పాటు నెలకు 10 జీబీ జియో 4జీ డేటా,  మొత్తం 100 జీబీ డేటా ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది.   మూడు  కేటగిరీలుగా ఈ ఉచిత డేటాను ఆఫర్‌ చేస్తోంది.

అయితే ఆసుస్‌ స్మార్ట్‌ఫోన్‌లో జియో సిమ్‌ను అసుస్ ఫోన్‌లో వేసి రూ.309 ఆపైన ప్యాక్‌ను రీచార్జి చేసుకుంటే చాలు.  ఈ ఆఫర్ కింద వస్తున్న వినియోగదారులకు జియోలో రూ .309 లేదా అంతకంటే ఎక్కువ  రీచార్జ్‌ వచ్చే రోజుకు 1జీబీ డేటాతోపాటుగా నెలకు 10 జీబీ డేటా లభించనుంది. క్రెడిట్ పొందడానికి రీఛార్జి  తరువాత వినియోగదారులకు 48 గంటలు వేచి చేయాలి. పది నెలలకు అంటే.. మార్చి 31, 2018 వరకు గరిష్టంగా 10 రీచార్జిలకు ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చన్నమాట.

ఆసుస్ జెన్‌ఫోన్ జూమ్, జెన్‌ఫోన్ 3 డీలక్స్, జెన్‌ఫోన్ 3 అల్ట్రా, జెన్‌ఫోన్ 3 (5.2), జెన్‌ఫోన్ 3 (5.5) ఫోన్లను వాడే వారికి నెలకు 10 జీబీ డేటా చొప్పున 10 నెలలకు 100 జీబీ జియో 4జీ డేటా ఉచితంగా లభిస్తున్నది. అదేవిధంగా జెన్‌ఫోన్ 2, జెన్‌ఫోన్ 2 లేజర్, జెన్‌ఫోన్ 2 లేజర్ 5.5, జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్, జెన్‌ఫోన్ 3 లేజర్, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.2, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.5 ఫోన్లను వాడుతున్న యూజర్లకు నెలకు 5జీబీ డేటా చొప్పున 10 నెలలకు 50 జీబీ డేటా లభిస్తుంది. ఇక జెన్‌ఫోన్ సెల్ఫీ, జెన్‌ఫోన్ మ్యాక్స్, జెన్‌ఫోన్ లైవ్, జెన్‌ఫోన్ గో 4.5 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్ గో 5.0 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్ గో 5.5 ఎల్‌టీఈ ఫోన్లను వాడుతున్న వారికి నెలకు 3 జీబీ డేటా చొప్పున 10 నెలలకు 30 జీబీ డేటా  ఉచితం.

మై జియో యాప్‌లో అనువర్తనాన్ని డౌన్లోడ్ చేసి ఈ దశలను పాటించాలి.  యాప్‌ ఓపెన్ చేసి  నా వోచర్లు -> వీక్షణ రసీదును -> నా నంబర్ రీఛార్జ్ -> రీఛార్జ్ నిర్ధారించండి -> రీఛార్జ్  సక్సెస్‌ నోటిఫికేషన్ వస్తుంది.  అయితే జియో జతకట్టిన కంపెనీల్లో ఆసుస్‌ మొదటి కాదు. ఇంతకుముం‍్దు షియామి, జియోనీ కంపెనీ ఫోన్లలో కూడా జియో ఉచిత  డేటాను  ప్రకటించింది. మరోవైపు జూన్ నెలలో రిలయన్స్ జీయో 4 జి మొబైల్ స్పీడ్ చార్టులో టాప్‌లోఉందని ట్రాయ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.



 

మరిన్ని వార్తలు