లైవ్ బ్యూటిఫికేషన్ టెక్నాలజీతో ఆసుస్ కొత్తఫోన్

24 May, 2017 18:34 IST|Sakshi
లైవ్ బ్యూటిఫికేషన్ టెక్నాలజీతో ఆసుస్ కొత్తఫోన్
తైవనీస్ హ్యాండ్ సెట్ల తయారీదారి ఆసుస్ ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.  జెన్ ఫోన్ లైవ్(జెడ్బి501కేఎల్) పేరుతో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. గత ఫిబ్రవరిలోనే దీన్ని ఆవిష్కరించగా.. ప్రస్తుతం ఇది మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ ధర 9,999 రూపాయలు. నేటి నుంచే ఈ స్మార్ట్ ఫోన్ ఆఫ్ లైన్, ఆన్ లైన్ రీటైలర్స్ లో విక్రయానికి వస్తోంది. ఆసుస్ జెన్ ఫోన్ లైవ్ స్మార్ట్ ఫోన్ లో ఉన్న ప్రత్యేక ఆకర్షణ, లైవ్ స్ట్రీమింగ్ బ్యూటిఫికేషన్ టెక్నాలజీ. ప్రపంచంలోనే తొలి లైవ్ స్ట్రీమింగ్ బ్యూటిఫికేషన్ టెక్నాలజీతో ఇది మార్కెట్లోకి వచ్చింది. బ్యూటీలైవ్ యాప్ ను ఇది కలిగి ఉంది. సోషల్ మీడియా సైట్లలో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేటప్పుడు ఈ బ్యూటీలైవ్ యాప్ ఎంతో సహకరిస్తోంది. వాయిస్ క్వాలిటీ స్పష్టంగా ఉండటానికి డ్యూయల్ ఎంఈఎంలను, మంచి ఆడియో కోసం కొత్త 5-మెగ్నెంట్ స్పీకర్ ను ఇది అందిస్తోంది.
 
ఆసుస్ జెన్ ఫోన్ లైవ్(జెడ్బి501కేఎల్) ఫీచర్లెలా ఉన్నాయో ఓ సారి చూద్దాం...
ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఆధారితంగా జెన్ యూఐ 3.5తో ఇది రన్ అవుతోంది
5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే
2.5డీ కర్వ్డ్ గ్లాస్
క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్
2జీబీ ర్యామ్
16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
128జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ పిక్సెల్ మాస్టర్ రియర్ కెమెరా విత్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ 1.4 మైక్రోన్ పిక్సెల్ సెన్సార్
డ్యూయల్ సిమ్(నానో+మైక్రో)
4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ
2650ఎంఏహెచ్ బ్యాటరీ
మరిన్ని వార్తలు