ఫాదర్స్ డే ఆఫర్‌ : ఐ ఫోన్‌ 6పై భారీ తగ్గింపు

7 Jun, 2017 17:56 IST|Sakshi
ఫాదర్స్ డే ఆఫర్‌ : ఐ ఫోన్‌ 6పై భారీ తగ్గింపు

ముంబై:  ఆపిల్‌ ఐఫోన్ అభిమానులకు ఆన్‌లైన్  రీటైలర్‌ ఫ్లిప్‌కార్డ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఆపిల్‌ ఐ ఫోన్‌ 6 ను  భారీ డిస్కౌంట్‌ ధరలో అందుబాటులోకి తేనుంది.  అతి తక్కువ ధరలో ప్రత్యేక ధరలో ఈస్మార్ట్‌ఫోన్‌ను జూన్ 8 నుంచి జూన్ 10 వరకు  విక్రయించనుంది.

 అయితే అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ,  దాదాపు 2,999 లకే అందించనుంది. దీనిపై  ప్రకటన గురువారం వెల్లడించనుంది.  వెబ్‌సైట్‌ అందించిన సమాచారం ప్రకారం వరల్డ్‌ బెస్ట్‌ డాడ్ పేరుతో ఈ డిస్కౌంట్‌ను  ప్రకటించింది.   జూన్‌ 8 గురువారం, జూన్‌ 10 శనివారం వరకు ఈ తగ్గింపు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందిస్తోంది.
అయితే ప్రస్తుతం, ఆపిల్ ఐఫోన్ 6 (స్పేస్ గ్రే, 32 జీబి) ఫ్లిప్కార్ట్‌ 32 శాతం డిస్కౌంటుతో రూ.24,990 కు అందిస్తోంది.  ఆపిల్ ఐఫోన్ 6 (16 జిబి) సిల్వర్, గోల్డ్  వేరియంట్లు, వరుసగా రూ.36,990, రూ. 36,499 గాఉన్నాయి. అదనంగా రూ.15వేలదాకా ఎక్సేంజ్‌ ఆఫర్‌  కూడా ఉంది.
కాగా భారత్‌లోఫాదర్స్‌ డేను ఈ సంవత్సరం జూన్ 18 న (జూన్‌ నెలలోని మూడవ ఆదివారం) జరుపుకుంటున్నారు. 



 

మరిన్ని వార్తలు