ఐ ఫోన్‌ ఎస్‌ఈ ధర ఎంత తగ్గిందో తెలుసా?

21 Mar, 2017 21:03 IST|Sakshi


న్యూఢిల్లీ: భారీ అమ్మకాలపై కన్నేసిన  ఆపిల్ అధీకృత ఆఫ్‌లైన్‌ విక్రయదారులు  ఐఫోన్ ఎస్ఈ(స్పెషల్ ఎడిసన్)  ను చవక​ ధరలకే  అందించనున్నారు.  ఐ ఫోన్‌ మేకర్‌ ఆపిల్‌  ఈ అమ్మకాలను  ప్రకటించకపోయినా దాని ఆఫ్‌లైన్‌ రీటైలర్‌  ఐ నెట్‌  ఈ సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.  ఐఫోన్ ఎస్ఈ  రెండు వెర్షన్‌ లను తక్కువ ధరకే విక్రయించనున్నట్టు ప్రకటించింది.

ఐఫోన్ ఎస్ఈ 16 జీబీ వెర్షన్ రూ 19.999,  64 జీబీ  వెర్షన్ ను రూ 25.999కి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఈ రెండు ఫోన్లను  క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా మాత్రమే ఉపయోగించి కొనుగోలు  చేయొచ్చని తెలిపింది.  దీని ద్వారా రూ .5,000 క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ తరువాత  ఈ ధర అని  వివరణ ఇచ్చింది.  అంతేకాదు ప్రాంతాన్ని బట్టి ధరలో కొంత తేడా వుండొచ్చని పేర్కొంది.

యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్, ఆర్‌బీఎల్‌, బ్యాంక్, ఎస్బిఐ, స్టాండర్డ్ చార్టర్డ్, పేరు, మరియు ఎస్ బ్యాంక్ చెందిన   క్రెడిట్ / డెబిట్ కార్డులను ఈ కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చని ట్వీట్‌ చేసింది.  పూర్తి వివరాలకు  ఐటీ నెట్‌ ఇన్ఫోకాం ట్విట్టర్‌ను   పరిశీలించగలరు.

 

Read latest Technology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు