పేటీఎంలో ఐఫోన్‌ ఎస్‌ఈ ధర తగ్గింది!

5 Aug, 2017 17:36 IST|Sakshi
పేటీఎంలో ఐఫోన్‌ ఎస్‌ఈ ధర తగ్గింది!
ప్రస్తుతం భారత్‌లో దొరుకుతున్న ఆపిల్‌ స్మార్ట్‌ఫోన్లలో అత్యంత సరసమైన ఫోన్‌ ఏదైనా ఉందా? అంటే అది ఐఫోన్‌ ఎస్‌ఈనే. ఈ స్మార్ట్‌ఫోన్‌ 32జీబీ మోడల్‌ను ప్రస్తుతం పేటీఎం ఆన్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌లో రూ.22,990కే విక్రయిస్తోంది. అంతేకాక అదనంగా 3000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఈ ఫోన్‌పై పేటీఎం ఆఫర్‌ చేస్తోంది. దీంతో ఐఫోన్‌ ఎస్‌ఈ ధర ఫైనల్‌గా రూ.19,990కి దిగొచ్చింది. అసలు పేటీఎం మాల్‌లో ఐఫోన్‌ ఎస్‌ఈ ధర 27,200 రూపాయలు. 
 
ఈ ప్రొడక్ట్‌ను కార్ట్‌లో యాడ్‌ చేసుకున్న అనంతరం ప్రోమో కాడ్‌ను ఆధారితంగా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని పేటీఎం తెలిపింది. ప్రోమో కోడ్‌ను వాడుకుని, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను పొందే కస్టమర్లకు క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌ అందుబాటులో ఉండదట. ఆశ్చర్యకరంగా ఈ హ్యాండ్‌సెట్‌పై 9000 రూపాయల బైబ్యాక్‌ గ్యారెంటీని కూడా పేటీఎం మాల్‌ ఆఫర్‌ చేస్తోంది. ఐఫోన్‌ ఎస్‌తో పాటు ఐఫోన్‌ 5ఎస్‌ నుంచి ఐఫోన్‌ 7 ప్లస్‌ వరకున్న పలు ఐఫోన్లపై క్యాష్‌బ్యాక్‌, ఫ్లాష్‌ ఆఫర్లను పేటీఎం మాల్‌ ప్రకటించింది. 
 
ఐఫోన్‌ ఎస్‌ఈ ఫీచర్లు...
4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే
ఆపిల్‌ ఏ9 ఎస్‌ఓసీ
12ఎంపీ రియర్‌ కెమెరా
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
Read latest Technology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు