కార్బన్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌..ధర ఎంత?

19 May, 2017 20:31 IST|Sakshi
కార్బన్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌..ధర ఎంత?

న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్‌  తయారీ  సంస్థ  కార్బన్  సరికొత్త  స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. తద్వారా తన  ఉత్పత్తుల శ్రేణిని విస్తరించింది. గత వారం  బడ్జెట్ ధరలో ఆరా పవర్‌ 3జీనులాంచ్‌  చేసిన  కార్బన్‌   ఈ సిరీస్‌లో మరో కొత్త డివైస్‌ను తీసుకొచ్చింది.  ఆరా పవర్ 4జీ ప్లస్   పేరుతో శుక్రవారం  దీన్ని విడుదల చేసింది.  దీని  ధర రూ .5,790గా ప్రకటించింది.  ఫ్రీ ప్రొటెక్టివ్‌ కవర్‌తోపాటు  గ్రే అండ్‌ షాంపైన్  కలర్స్‌లో  ఈ స్మార్ట్‌ఫోన్‌ను  అందుబాటులోకి  తెచ్చింది.  

ఆరా పవర్ 4జీ ప్లస్  స్పెసిఫికేషన్స్‌
720x1280 పిక్సెల్ రిసల్యూషన్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్‌ ఆపరేటింగ్‌ సిస్టం
5 ఇంచెస్‌ హెచ్‌ డీ డిస్‌ప్లే  
క్వాడ్-కోర్ ప్రాసెసర్
1జీబీ ర్యామ్‌
16 జీబీ ఇంటర్నల్‌ మొమరీ,  32జీబీ వరకు ఎక్స్‌ పాండబుల్‌ మొమరీ
5 ఎంపీ రియర్‌  కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
4,000  ఎంఏహెచ్‌  బ్యాటరీ

Read latest Technology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా