మైక్రోమ్యాక్స్‌ కాన్వాస్‌-2:ఏడాదంతా ఫ్రీ కాలింగ్‌, 4జీ డేటా

11 May, 2017 15:09 IST|Sakshi
మైక్రోమ్యాక్స్‌ కాన్వాస్‌-2:ఏడాదంతా ఫ్రీ కాలింగ్‌ 4జీ డేటా

న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మైక్రోమ్యాక్స్‌  యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.  2012లో లాంచ్‌ చేసిన కాన్వాస్‌ 2 ను తిరిగి  అద్భుతమైన ఆఫర్లతో తిరిగి లాంచ్‌ చేసింది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినూత్న ఆఫర్లతో  వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా యూజర్లకు సంవత్సరంపాటు 4జీ  ఉచిత డేటాను, ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్‌ సదుపాయాన్ని ఆఫర్‌ చేస్తోంది.  దీనికోసం  దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌తో  భాగస్వామ్యం కుదుర్చుకుంది.  ఈ మేరకు  కాన్వాస్‌ 2 డివైస్‌లో ఎయిర్‌టెల్‌ 4జీ సిమ్‌తో కలిపి  అందిస్తోంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో లాంచ్‌ చేసిన దీని ధరను రూ.11,999 గా కంపెనీ నిర్ణయించింది. అంతేకాదు దీనిపై ఒక సంవత్సరం  స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌  ఆఫర్‌ కూడా అందిస్తోంది. 

కాన్వాస్‌ -2 ఫీచర్లు
ఫ్రింగర్‌ ప్రింట్‌   సెన్సర్‌,
క్వాడ్‌ కోర్‌ 1.3 గిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌
3 జీబీర్యామ్‌
16 జీబీ  ఇంటర్నెనల్‌ స్టోరేజ్‌,  
64 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం
13 ఎంపీ రియర్‌  కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా, విత్‌ ఎఫ్‌.20 ఎపర్చర్, ఆటో ఫోకస్,  5పి లెన్స్
3050 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఇతర స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే, ఎయిర్‌టెల్‌భాగస్వామ్యంతో ఏడాది పాటు ఉచిత 4జీ డేటా,  ఉచిత కాలింగ్‌ సదుపాయంతో కాన్వాస్‌ 2    ఒక బెంచ్‌మార్క్‌గా, విప్లవాత్మకంగా ఆశిస్తున్నామని మైక్రో మ్యాక్స్‌ కో ఫౌండర్‌ రాహుల్‌ శర్మ  వ్యాఖ్యానించారు. తమ వినియోగదారులకు అద్భుతమైన యూజర్ అనుభవాన్ని, గొప్ప స్పెక్స్,  ఇతర కావలసిన లక్షణాలతో ఒక పరికరాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు  మైక్రోమ్యాక్స్  తెలిపింది. మార్కెట్లో తన బలమైన హోదాను మరింత పటిష్టపరుచుకోవడంతోపాటు, భారత్‌ సహా ఇతర మార్కెట్లలో 1 మిలియన్ కన్నా ఎక్కువ కాన్వాస్ 2 స్మార్ట్‌ఫోన్లను  విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో తన ధరల విభాగంలో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ అని కంపెనీ వాదిస్తోంది.
 
 

మరిన్ని వార్తలు