మోటో సీ ప్లస్‌ వచ్చేసింది...ధర ఎంతంటే

19 Jun, 2017 11:25 IST|Sakshi
మోటో సీ ప్లస్‌ వచ్చేసింది...ధర ఎంతంటే

లెనోవా బ్రాండ్‌ మోటోరోలా సంస్థ   మోటో సీ ప్ల‌స్ పేరిట  ఓకొత్త  ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను  నేడు (సోమవారం) విడుద‌ల చేసింది.   భారత మార్కెట్లో ఈస్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేస్తున్న విషయాన్ని సంస్థ ట్విట్టర్లో వెల్లడించింది. మధ్నాహ్నం 12 గంటలకు విడుదల  చేయనున్నట్టు ట్వీట్‌  చేసింది.   మంగళవారం మధ్యాహ్నం 12గం.నుంచి ఫ్లిప్‌కార్ట్‌ లోప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.   ఈ డివైస్‌ ధరను రూ. 6,999గా నిర్ణయించింది. రెండు నానో సిమ్‌ లతో కలిపి మొత్తం మూడు స్లాట్‌లతో దీన్ని లాంచ్‌ చేసింది. 


మోటో సీ ప్ల‌స్ ఫీచ‌ర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
 720 x 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌,
1/2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌,
32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో భారతదేశం ఒకటి. అంతకంతకూ  పుంజుకుంటున్న డేటా వినియోగం ,  పడిపోతున్న డేటా ధరల నేపథ్యంలో ఫీచర్‌ ఫోన్‌వినియోగదారులు పెద్ద సంఖ్యలో   సరసమైన  ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

 

మరిన్ని వార్తలు