లాంచింగ్‌కు సిద్ధమైన మోటో ఎక్స్‌4, ఫీచర్లివే!

31 Aug, 2017 16:41 IST|Sakshi
లాంచింగ్‌కు సిద్ధమైన మోటో ఎక్స్‌4, ఫీచర్లివే!
మోటోరోలా మోటో ఎక్స్‌ లైనప్‌లో ఎంతో కాలంగా వేచిచూస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్‌ 2న మార్కెట్‌లోకి రాబోతుంది. మోటో ఎక్స్‌4 విడుదల తేదీను మోటోరోలా అధికారికంగా ప్రకటించింది. మోటోరోలా ఫిలిప్పీన్స్‌ ఫేస్‌బుక్‌ పేజీలో తాజాగా పోస్టు చేసిన పోస్టర్‌లో లాంచ్‌ ఈవెంట్‌ సాయంత్రం ఆరు గంటలకు ఉండబోతుందని మోటోరోలా తెలిపింది. ఫిలిప్పీన్స్‌లో ''హలోమోటోఎక్స్‌'' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు సుమారు 26వేల రూపాయలుగా ఉంబోతుందని టాక్‌. రెండు వేరియంట్లలో ఇది విడుదల కాబోతుంది. 
 
మోటో ఎక్స్‌4 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు... 
5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌ ఓఎస్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 630 ప్రాసెసర్‌
గొర్రిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌
12 ఎంపీ రియర్‌ కెమెరాలు
16ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
256జీబీ వరకు విస్తరణ మెమరీ
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 
Read latest Technology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు