మోటో కొత్త ఫోన్‌, ధరెంతో తెలుసా?

29 Jul, 2017 09:43 IST|Sakshi
మోటో కొత్త ఫోన్‌, ధరెంతో తెలుసా?
అద్బుతమైన ఫీచర్లతో సరితూగ తగ్గ ధరలతో మోటోరోలా ఇటీవల  సరికొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేస్తోంది. తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోటో ఎక్స్‌4ను కూడా మార్కెట్‌లోకి లాంచ్‌ చేసేందుకు మోటోరోలా సన్నద్ధమవుతోంది. ఈ ఫోన్‌ అధికారికంగా లాంచ్‌ కావడానికి ముందే ధర, ఫీచర్లు లీకయ్యాయి. టిప్‌స్టర్‌ రోలాండ్ క్వాండ్ట్ అనే వ్యక్తి దీని ధర వివరాలను ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారు. మోటోరోలా తీసుకురాబోతున్న అప్‌కమింగ్‌ డివైజ్‌ మోటో ఎక్స్‌4,  32జీబీ వేరియంట్‌ ధర తూర్పు యూరోపియన్‌ మార్కెట్‌లో 350 యూరోలు అంటే సుమారు రూ.26,300 వరకు ఉండొచ్చని లీక్‌చేశారు. ఈ ఫోన్‌ ధర మోటోరోలా తీసుకొస్తున్న మోటో-ఎక్స్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలకు తగ్గట్టే ఉన్నాయని చెప్పారు.
 
ప్రస్తుతం మోటోరోలా 2015 నుంచి తీసుకొస్తున్న ఎక్స్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలు రూ.27వేల మధ్యలో ఉన్నాయి. అంతేకాక ఎక్కువ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ ఇతర వేరియంట్లను కూడా మోటోరోలా లాంచ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్టు క్వాండ్ట్‌ తెలిపారు. ఈ ఫోన్‌ను ఈ వారం మొదట్లో లాంచ్‌చేసిన మోటో జెడ్‌2 ఫోర్స్‌ ఈవెంట్‌లోనే తీసుకొస్తారని టెక్‌ వర్గాలు అంచనావేశాయి. కానీ కేవలం మోటో జెడ్‌2 ఫోర్స్‌ను మాత్రమే కంపెనీ లాంచ్‌ చేసింది.  
 
మోటో ఎక్స్‌ 4 ఫీచర్లు ఈ విధంగా ఉండబోతున్నాయట...
అల్యూమినియం బాడీ
డ్యూయల్‌ కెమెరా సెటప్‌
12 మెగాపిక్సెల్‌, 8 మెగాపిక్సెల్‌తో రియర్‌ కెమెరా
ఐపీ68 వాటర్‌ప్రూఫింగ్‌  
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 630 చిప్‌సెట్‌
32జీబీ లేదా 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
4జీబీ ర్యామ్‌
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఆండ్రాయిడ్‌ నోగట్‌
Read latest Technology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు