వ్యోమగాములకు కొత్త సూట్‌

11 Sep, 2017 15:04 IST|Sakshi
వ్యోమగాములకు కొత్త సూట్‌

న్యూయార్క్‌ : అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాములకు కొత్త స్పేస్‌సూట్‌ను రూపొందించిపట్లు తయారీ సంస్థ స్పేస్‌ ఎక్స్‌ ప్రకటించింది. కొత్తగా రూపొందించిన స్పేస్‌ సూట్‌ను సోమవారం సంస్థ సీఈఓ ఎలెన్‌ ముస్క్‌ ఆవిష్కరించారు. ఇప్పటివరకూ వ్యోమగాములు ఎక్స్‌ట్రావెహిక్యులర్‌ మొబిలిటీ యూనిట్స్‌ (ఈఎంయూ)లను వాడుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నవారూ.. వీటినే ఉపయోగిస్తున్నారు. ఈఎంయూలను సుమారు 40 ఏళ్ల కిందట రూపొందించారు. ఈ సూట్ల వల్ల వ్యోమగాములకు  స్పేస్‌వాక్‌లో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా నవీకరించిన సూట్‌ను తయారు చేశామని చెప్పారు. కొత్త సూట్‌లో గ్లౌవుజులు, వార్మర్స్‌, హెల్మెట్‌లో అభివృద్ధి పరిచని కెమెరాలు జోడించారు.

 

మరిన్ని వార్తలు