నోకియా కొత్త ఫోన్ భారత్లోకి వచ్చేసింది!

27 Mar, 2017 18:32 IST|Sakshi
నోకియా కొత్త ఫోన్ భారత్లోకి వచ్చేసింది!
ఒకప్పుడు మొబైల్ ఫోన్ రంగంలో తిరుగులేని బ్రాండ్ నోకియా. స్మార్ట్ ఫోన్ల ఆగమనంతో నోకియా బ్రాండ్ తన వైభవం కోల్పోయింది. తాజాగా తన పునర్వైభవం కోసం నోకియా కొత్త కొత్త ఫోన్లతో మార్కెట్లోకి వస్తోంది. గత డిసెంబర్ లో నోకియా బ్రాండ్ లో హెచ్ఎండీ గ్లోబల్ లాంచ్ చేసిన నోకియా 150, నోకియా 150 డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్లలో, నోకియా 150 డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్ను భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ లో దీన్ని అమ్మకానికి ఉంచింది. దీని ధర రూ.2059గా హెచ్ఎండీ గ్లోబల్ పేర్కొంది. నోకియా 150 డ్యూయల్ సిమ్ ఫీచర్స్ కలిగిన ఈ ఫోన్, ఫ్లిప్ కార్ట్ లో తెలుపు లేదా నలుపు రంగుల్లో లభ్యమవుతుండగా.. అమెజాన్ ఇండియాలో కేవలం నలుపు రంగు ఫోన్ మాత్రమే అందుబాటులో ఉంది.
 
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్, 32 జీబీ వరకు  ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఈ ఫోన్ ఫీచర్లు. ఈ ఫోన్ కు 1020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 32 గ్రాముల బరువున్న ఈ ఫోన్లో ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, బ్లూటూత్ వీ3.0 విత్ స్లామ్, వీజీఏ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. నోకియా బ్రాండులో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు.. నోకియా 3, నోకియా 5, నోకియా 6లను హెచ్ఎండీ గ్లోబల్ ఇటీవలే ఎండబ్ల్యూసీ 2017 ఈవెంట్లో ప్రకటించింది. ఈ ఫోన్లను రెండో క్వార్టర్లో భారత్ తో సహా 120 మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది. సరసమైన ధరల్లోనే వీటిని లాంచ్ చేస్తామని పేర్కొంది. 
మరిన్ని వార్తలు