రోడ్లపైకి ఎలక్ట్రానిక్ దిగ్గజ కార్లు

3 May, 2017 15:44 IST|Sakshi
రోడ్లపైకి ఎలక్ట్రానిక్ దిగ్గజ కార్లు
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల టెస్టింగ్ పై టెక్ దిగ్గజాలన్నీ పోటీపడి మరి ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్స్ తెచ్చుకుంటున్నాయి. తాజాగా స్మార్ట్ ఫోన్ల రారాజు, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై దృష్టిసారించింది. వీటి టెస్టింగ్ కు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా తెచ్చేసుకుంది.  సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల టెస్టింగ్ కోసం ఆమోదం తెచ్చుకున్న తొలి ఎలక్ట్రానిక్స్ దిగ్గజంగా శాంసంగ్ పేరులోకి వచ్చింది. దీంతో ఈ కంపెనీ దక్షిణ కొరియా రోడ్లపై సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను చక్కర్లు కొట్టిచనుంది. హ్యుందాయ్, కియా లాంటి కార్ల కంపెనీలకు ఇప్పటికే భూమి, మౌలికసదుపాయాలు, రవాణా మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.
 
సెన్సార్స్, కెమెరాలతో వీటి టెస్టింగ్ ను శాంసంగ్ కంపెనీ చేపట్టనుందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అడ్డంకులు ఎదురైనప్పుడు వాహనాలను ఎలా నడపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా కంపెనీ అధ్యయనం చేయనుంది. స్వయంప్రతిపత్త డ్రైవింగ్ టెక్నాలజీపై కంపెనీ 2015లోనే ఓ బిజినెస్ యూనిట్ ను ప్రారంభించింది. 2016 నవంబర్ లో కనెక్టెడ్ కార్ల కోసం సాఫ్ట్ వేర్ పరికరాలను అభివృద్ధి చేసే అమెరికా సంస్థ హర్మాన్ ను శాంసంగ్ 8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. పెద్ద పెద్ద టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్, ఆపిల్, బైడూ, సంప్రదాయ కారు తయారీ సంస్థలు జీఎం, ఫోర్డ్, రైడ్ హైలింగ్ స్టార్టప్ ఉబర్, దీదీలు ఇప్పటికే డ్రైవర్ లెస్ కారు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నాయి.
మరిన్ని వార్తలు