ఐఫోన్ కంటే అవే చాలా బెస్ట్

14 Jun, 2017 11:07 IST|Sakshi
ఐఫోన్ కంటే అవే చాలా బెస్ట్
గెలాక్సీ నోట్7 పేలుళ్ల ఘటన అనంతరం శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్లను మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్లకు కిల్లర్ గా వచ్చిన ఈ ఫోన్లు అన్నమాట నిలబెట్టుకుంటున్నాయి. గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫోన్లు బెస్ట్ స్మార్ట్ ఫోన్లుగా వినియోగదారుల మన్ననలను పొందుతున్నాయి. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ కంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్లే బెస్ట్ స్మార్ట్ ఫోన్లుగా దూసుకుపోతున్నట్టు వినియోగదారుల రిపోర్టులలో వెల్లడైంది.  ఎంతో ఆకర్షణీయంగా, ప్రకాశవంతమైన డిస్ ప్లేతో శాంసంగ్ కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల డివైజ్ లు ఉన్నాయని కన్జ్యూమర్ రిపోర్టులు కొనియాడుతున్నాయి. మంచి బ్యాటరీ సామర్థ్యం,  అద్భుతమైన కెమెరాలంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల ఘటన అనంతరం శాంసంగ్ కొంచెం ఎక్కువగా బ్యాటరీపై దృష్టిసారించింది. మళ్లీ అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఎంతో జాగ్రత్త వహించింది. ఒకవేళ ఈ ఫోన్ పూల్ లో పడిపోయినా ప్రమాదమేమి  ఉండదని వినియోగదారులు చెబుతున్నారు. వాటర్ రెసిస్టెన్స్, మంచి కెమెరాలు, అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యంతో శాంసంగ్ కొత్త ఫోన్లు మార్కెట్లో దూసుకెళ్తున్నట్టు తెలిపారు.  ఈ కన్జ్యూమర్ రిపోర్టులలో శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ టాప్-రేటు సొంతంచేసుకున్న స్మార్ట్ ఫోన్ గా కంపెనీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. ఐఫోన్ 7 ప్లస్ ఐదు రేటును సంపాదించుకుంది. ఐఫోన్ 7 ప్లస్ కంటే గెలాక్సీ ఎస్8 ప్లస్, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎల్జీ జీ6 స్మార్ట్ ఫోన్లే ముందంజలో నిలిచాయి. ఒకవేళ వీటిని అధిగమించాలంటే ఆపిల్, ఐఫోన్ 8ను వినియోగదారులకు ఎంతో ఆకర్షణీయంగా తీసుకురావాల్సి ఉంది. 
 
ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌ ప్రత్యేకతలు...
గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌ రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ క్యూహెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, ఇన్‌విజిబుల్‌ హోమ్‌ బటన్, 1.9 గిగాహెడ్జ్ ఆక్టాకోర్‌ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 12 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా వంటి పలు ప్రత్యేకతలున్నాయి. అయితే ఎస్‌8లో 5.8 అంగుళాల స్క్రీన్, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లుంటే ఎస్‌8 ప్లస్‌లో మాత్రం 6.2 అంగుళాల స్క్రీన్, 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీని కంపెనీ అమర్చింది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్లు అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. విక్రయాల్లో ఎస్ 8 దూకుడు ప్రదర్శించడంతో రెండో త్రైమాసికంలో గణనీయమైన లాభాలు ఆర్జించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు