మీ ఫోన్‌కు ఓరియో అప్‌డేట్‌ వస్తుందా.. లేదా..?

24 Aug, 2017 12:09 IST|Sakshi
మీ ఫోన్‌కు ఓరియో అప్‌డేట్‌ వస్తుందా.. లేదా..?

సాక్షి, హైదరాబాద్‌: గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఓ 8.0 ను ఇటీవల విడుదల చేసింది.  అందరూ ఊహించినట్టుగా ఈ  కొత్త ఓఎస్‌కు ఓరియో (Oreo) అని నామకరణం చేసింది. ఈసందర్భంగా ఆండ్రాయిడ్‌ ఓరియో సరికొత్త అనుభవాన్ని వినియోగారులకు ఇస్తుందని, ఫోటోలు, స్మార్ట్‌ టెక్స్‌ సెలక్షన్‌, మనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకోనే విధంగా నోటిఫికేషన్‌ సెంటర్‌ వంటి వాటిని పొందుపరిచినట్లు గూగుల్‌ ప్రకటించింది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఓ 8.0 ముందుగా నెక్సస్, పిక్సెల్‌ డివైస్‌లలో అందుబాటులో ఉండనుంది.  

అనంతరం ఇతర ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ప్రముఖ మొబైల్‌ కంపెనీలైన షావోమి, హువాయ్, హెచ్‌టీసీ, క్యోసెరా, మోటరోలా, నోకియా, శాంసంగ్, షార్ప్, సోనీలకు ఆండ్రాయిడ్ ఒరియో అప్‌గ్రేడ్‌ ఉంటుందని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఇంజనీరింగ్‌) డేవ్ బుర్కే  లాంచింగ్‌ సందర్భంగా ప్రకటించారు.

ఆండ్రాయిడ్‌ ఓ అప్‌డేట్‌ ఇవ్వబడే ఫోన్‌లు
గూగుల్‌: గూగుల్‌ పిక్సెల్‌, గూగుల్‌ పిక్సెల్‌ 2, గూగుల్‌ పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌, నెక్సస్‌ 5ఎక్స్‌, నెక్సస్‌ 6పీ డివైస్‌లలకు  ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) రూపంలో  అందుబాటులో  ఉంటుందని  గూగుల్‌ వెల్లడించింది.

శాంసంగ్‌: ►శాంసంగ్‌ గెలాక్సీ ఏ3, ►శాంసంగ్‌ గెలాక్సీ ఏ5, ►శాంసంగ్‌ గెలాక్సీ ఏ7, ►శాంసంగ్‌ గెలాక్సీ ఏ8, ►శాంసంగ్‌ గెలాక్సీ ఏ9, ►శాంసంగ్‌ గెలా‍క్సీ సీ9ప్రొ, ► శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ ఎఫ్‌ఈ, ► శాంసంగ్‌ గెలాక్సీ జే7వీ, ► శాంసంగ్‌ గెలాక్సీ జే7 మ్యాక్స్(2017)‌, ►శాంసంగ్‌ గెలాక్సీ జే7ప్రో(2017), ►శాంసంగ్‌ గెలాక్సీ జే7 ప్రైమ్‌, ►గెలాక్సీ ఎస్‌7, ►శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌, ►శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8, ►శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌, ►శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌8

షావోమి: ►షావోమి రెడ్‌మీ నోట్‌ 3, ►షావోమి రెడ్‌మీ నోట్‌4 , ►షావోమి రెడ్‌ మీ 4ఏ, ►షావోమి ఎమ్‌ఐ 5, ►షావోమి ఎమ్‌ఐ 5ఎస్‌, ►షావోమి 5ఎస్‌ ప్లస్‌, ►షావోమి రెడ్‌మీ 3ఎస్‌, ►షావోమి రెడ్‌మీ 3ఎస్‌ ప్రైమ్‌, ►షావోమి రెడ్‌మీ 4ఎక్స్‌, ►షావోమి నోట్‌4ఎక్స్‌, ►షావోమి రెడ్‌మీ 4, ►షావోమి ఎమ్‌ఐ మ్యాక్స్‌, ►షావోమి ఎమ్‌ఐ 5సీ

సోని: ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ పెర్ఫామెన్స్‌, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ కంపాక్ట్‌, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ జెడ్‌, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ ప్రీమియం, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ1, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ1 ఆల్ట్రా, ►సోనీ ఎక్స్‌పీరియా ఎల్‌1

వన్‌ప్లస్‌: ►వన్‌ప్లస్‌3, ►వన్‌ప్లస్‌ 3టీ, ►వన్‌ప్లస్‌5,

నోకియా: ►నోకియా 8, ►నోకియా6, ►నోకియా5, ►నోకియా3

మోటొరోలా: ►మోటో జెడ్‌, ►మోటో జెడ్‌ డ్రాయిడ్‌, ►మోటో జెడ్‌ ప్లే, ►మోటో జెడ్‌ ప్లే డ్రాయిడ్‌, ►మోటో జెడ్‌2 ప్లే, ►మోటో జెడ్‌ 2 ఫోర్స్‌, ►మోటో జీ4, ►మోటో జీ4 ప్లస్‌, ►మోటో జీ5, ►మోటో జీ5ఫ్లస్‌లకు త్వరలోనే ఓరియో అప్‌డేట్‌ రానుంది.

మరిన్ని వార్తలు