వాట్సాప్​లో ఐదు కొత్త ఫీచర్స్

2 Jul, 2020 13:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎప్పటినుంచో వేచి చూస్తున్న సరికొత్త ఫీచర్స్ వాట్సాప్​లో అతి త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. యానిమేటెడ్​ స్టిక్కర్స్, క్యూఆర్​ కోడ్స్, వెబ్​ వాట్సాప్​కు డార్క్ మోడ్​, క్వాలిటీ వీడియో కాల్స్​, కైఓఎస్​కు మాయమైపోయే స్టేటస్​ లాంటి ఫీచర్స్​ను కొద్దివారాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. (‘చైనా ట్విటర్‌’ అకౌంట్‌ మూసేసిన ప్రధాని)

క్యూఆర్​ కోడ్: ఓ వ్యక్తిని మీ వాట్సాప్​లో జత చేసుకోవడానికి వారి మొబైల్​ నంబర్​ను అడిగి తెలుసుకోవాల్సిన పని లేదు. ఇకపై ఒక్క క్యూఆర్​ కోడ్​తో వారి నంబర్​ను స్కాన్ చేసి, యాడ్ చేసుకోవచ్చు. (మనుషులపై పని చేస్తున్న వ్యాక్సిన్​)

యానిమేటెడ్​ స్టిక్కర్స్​: చాటింగ్​ను మరింత ఫన్​గా మార్చే యానిమేటెడ్​ స్టిక్కర్స్​ను వాట్సాప్​ తీసుకురానుంది. వీటిలో వారికి నచ్చిన స్టిక్కర్స్​ను యూజర్లు డౌన్​లోడ్​ చేసుకుని వాడుకోవచ్చు.

వెబ్​కు డార్క్​మోడ్​: ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లలో చాలా కాలం క్రితమే వాట్సాప్​ డార్క్ మోడ్​ను తీసుకొచ్చింది. ఇప్పుడిక వెబ్​ వెర్షన్​కూ ఈ ఫీచర్​ను జోడించనుంది.

వీడియో క్వాలిటీ: ఇటీవల గ్రూప్ వీడియో కాల్​లో పాల్గొనే వారి సంఖ్యను ఎనిమిదికి పెంచిన వాట్సాప్​, ఇప్పుడు కాల్ క్వాలిటీపై దృష్టి సారించింది. దాంతోపాటు కాల్​లో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిపై నొక్కితే ఫోకస్ అయ్యేలా మార్పులు చేర్పులు చేస్తోంది.

స్టేటస్​: స్టేటస్ తనంతట అదే మాయమైపోయే ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్​లలో అందుబాటులో ఉంది. కాగా, దీన్ని ఇప్పుడు కైఓఎస్​కు వాట్సాప్​ విస్తరించనుంది.

మరిన్ని వార్తలు