త్వరలోనే వాట్సాప్‌లోకి సరికొత్త ఫీచర్‌

10 Aug, 2017 09:23 IST|Sakshi
త్వరలోనే వాట్సాప్‌లోకి సరికొత్త ఫీచర్‌
మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో ఫుల్‌గా పాపులర్‌ అయిన వాట్సాప్‌ తాజాగా గూగుల​ ప్లే బీటా ప్రొగ్రామ్‌ ద్వారా తన యాప్‌కు సరికొత్త అప్‌డేట్‌ చేపట్టింది. 2.17.295 వెర్షన్‌తో హిడెన్‌ పేజీలో తన యాప్‌ను అప్‌డేట్‌ను చేసింది. ఈ అప్‌డేషన్‌, ఎంతో కాలంగా మార్కెట్‌లో చక్కర్లు కొడుతున్న పేమెంట్‌ ఫీచర్‌ అని బ్లాగ్‌ వెబ్‌సైట్‌ డబ్ల్యూఏబీటాఇన్ఫో చెప్పింది. డబ్ల్యూఏబీటాఇన్ఫో షేరు చేసిన ఇమేజీలో, ఫేస్‌బుక్‌కు చెందిన ఈ చాటింగ్‌ యాప్‌ యూపీఐ ద్వారా బ్యాంకు నుంచి బ్యాంకు ట్రాన్సఫర్లు చేసుకోవచ్చని తెలుపుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఆధార్‌ సదుపాయంతో ఇది పనిచేస్తుందని పేర్కొంది.
 
ఇప్పటికే మెసేజింగ్‌ యాప్‌లో ఫుల్‌గా ప్రాచుర్యం పొందిన వాట్సాప్‌, తన కస్టమర్లను మరింత పెంచుకోవడానికి పేమెంట్‌ ఫీచర్‌ను కూడా తన ప్లాట్‌ఫామ్‌పై లాంచ్‌ చేస్తుందని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారత్‌లో యూపీఐ ద్వారా జరిగే నగదు లావాదేవీలకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. దీంతో సరికొత్త యాప్‌లు పుట్టుకొచ్చాయి. ఈ యాప్స్‌కు పోటీగా, వాట్సాప్‌ కూడా పేమెంట్‌ ఫీచర్‌ను లాంచ్‌ చేయబోతుందని తెలిసింది. దీని కోసం ఈ కంపెనీ కొన్ని నెలల క్రితం తన జాబ్‌ లిస్టింగ్‌ సెషన్‌లో పేమెంట్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టుకు జాబ్‌ ఓపెనింగ్‌ను కూడా ప్రకటించింది. వాట్సాప్‌ పోటీదారులు వీచాట్‌, హైక్‌ మెసెంజర్‌లు కూడా ఇప్పటికే తమ ప్లాట్‌ఫామ్స్‌పై పేమెంట్‌ సర్వీసు ఫీచర్‌ను లాంచ్‌చేశాయి.  
మరిన్ని వార్తలు