హరికృష్ణ దుర్మరణం.. మరి మా పరిస్థితి ఏంటి!?

30 Aug, 2018 16:45 IST|Sakshi
ప్రమాదంలో గాయపడిన యువకులు.. ధ్వంసమైన కారు

సాక్షి, నల్గొండ : అతివేగం, సీటుబెల్టు లేని ప్రయాణం నందమూరి వారింట విషాదాన్ని నింపడంతో పాటు... మరో నలుగురు యువకుల జీవనాధారాన్ని ప్రశ్నార్థకం చేసింది. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న హరికృష్ణ కారు అదుపు తప్పి అన్నేపర్తి వద్ద డివైడర్‌ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో కారుపై పడింది.

ఈ ఘటనలో.. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఫొటోగ్రాఫర్లు శివ, భార్గవ్‌, ప్రవీణ్‌లకు గాయాలయ్యాయి. అంతేకాకుండా వీరికి సంబంధించిన కెమెరాలు, ఫొటోగ్రఫీకి సంబంధించిన ఇతర సామాగ్రితో పాటు కారు కూడా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించిన పోలీసులు... వీరిని కూడా ఆస్పత్రిలో చేర్చి వైద్య సదుపాయం కల్పించారు. కానీ హరికృష్ణ మృతదేహాన్ని తరలించిన తర్వాత తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా కుటుంబాలకు అవే జీవనాధారం..
ఫొటోగ్రాఫర్లుగా పనిచేస్తున్న ఆ యువకులు ఓ ప్రోగ్రామ్‌ నిమిత్తం చెన్నైకి వెళ్లి వస్తుండగా అనుకోని విధంగా హరికృష్ణ కారు రూపంలో ప్రమాదం ఎదురైంది. ఈ ఘటనలో వీరికి గాయాలు కాగా కెమెరాలు, ఫొటోగ్రఫీ సామాగ్రి సహా కారు కూడా ధ్వంసమైంది. అయితే ఆస్పత్రిలో చేర్చిన అనంతరం పోలీసులు తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ‘మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లం. ప్రస్తుతం మా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అప్పులు తెచ్చి మరీ కెమెరాలు కొనుగోలు చేశాం. అవే మా కుటుంబాలకు జీవనాధారం. రేపటి నుంచి ఎలా బతకాలి. గాయాల నుంచి కోలుకుని తిరిగి పనిలో చేరేంత వరకు మమ్మల్ని ఎవరు పోషిస్తారు. మాకు ఎవరు న్యాయం చేస్తారంటూ’ ప్రవీణ్‌, శివ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించిన ప్రభుత్వం.. తమకు కూడా సహాయం చేసి, కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలంటూ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేస్తున్నారు. కాగా, గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.

సంబంధిత కథనాలు:
ప్రముఖులకు ఈ జిల్లా అచ్చిరాదా!? 

కొన్నాళ్లక్రితం.. నటి ప్రణీతకు తప్పిన ముప్పు..

వేగం తీసిన ప్రాణాలెన్నో!

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కాళేశ్వరం వెట్‌ రన్‌ సక్సెస్‌పై కేసీఆర్‌ హర్షం

ఇంటర్‌ ఫలితాల వివాదంపై కేసీఆర్‌ కీలక నిర్ణయం

రీ వెరిఫికేషన్‌ కోసం 8 కేంద్రాలు

సుమన్‌ బామ్మర్ది వివాహం, హాజరైన కేటీఆర్‌

మోదీపై పోటీ ; ఆ వార్తలన్నీ ఫేక్‌..!

ఇంటర్‌ ఫలితాల వివాదంపై కేసీఆర్‌ సమీక్ష

ఎలా కొనేది ?

మరో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్‌ కూడా పూర్తి చేయని సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు

సర్వే షురూ..

‘పై’ హోదా.. ‘కింది’ పోస్టు!

ఏసీకి ఏరీ?

హోర్డింగ్‌ డేంజర్‌

పూల్‌.. థ్రిల్‌

ఇంటర్‌పై ఇంతటి నిర్లక్ష్యమా..!

ఊపందుకోని వరి ధాన్యం కొనుగోళ్లు

‘సైన్మా’ సూపర్‌ హిట్‌

భారతీయ పురుషుల్లో వంధ్యత్వం

వెలుగుల తళుకులు.. లాడ్‌బజార్‌ జిలుగులు

మట్టి స్నానం..మహా ప్రక్షాళనం

నిరీక్షణే..!

ఆ యువకుడిని భారత్‌కు రప్పించండి: దత్తాత్రేయ

రెండోరోజు ‘జెడ్పీటీసీ’కి 154 నామినేషన్లు 

ఎస్‌ఈసీ ఆఫీసులో గ్రీవెన్స్‌ సెల్‌ 

జాతీయ సమైక్యతకు  నిదర్శనం: డీజీపీ 

ఆడా ఉంటా.. ఈడా ఉంటా

అక్కడా వారిదే పెత్తనం!

తెలంగాణలో అసమర్థ  పాలన: రాపోలు

బాధాతప్త హృదయంతో నిర్ణయం తీసుకున్నా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షూటింగ్‌ సెట్లో అయాన్‌, అర్హా

వారి మధ్య స్మాష్‌ అయిపోయా..!!

రూ 18 లక్షల బ్యాగ్‌తో సోనం జిగేల్‌..

‘సీత’ ఎప్పుడొస్తుందో!

హీరోయిన్‌ను నిజంగానే ఏడిపించారు!

ప్రభాస్‌కు ఊరట