10 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

3 Nov, 2015 18:51 IST|Sakshi

భాగ్యనగర్ కాలనీ (హైదరాబాద్) : పేకాట స్థావరంపై కూకట్‌పల్లి పోలీసులు మంగళవారం దాడి చేసి నిర్వాహకుడితో పాటు 10 మందిని అరెస్టు చేశారు. కూకట్‌పల్లి హెచ్‌ఎంటీ శాతవాహన నగర్‌లోని వాటర్ ట్యాంకర్ సమీపంలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ క్రాంతి కుమార్ సిబ్బందితో ఆ స్థావరంపై దాడి చేసి నిర్వాహకుడు శ్రీనివాస్ సహా పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 9,900 నగదు, మూడు బైక్‌లు, 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు