ప్లాస్టిక్‌ వాడితే రూ. 10 వేలు ఫైన్‌

25 Sep, 2019 08:24 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌ : సోన్‌ గ్రామస్తులు మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నారు. గ్రామస్తులందరూ కలిసి గ్రామంలో ప్లాస్టిక్‌ను రూపుమాపేందుకు నడుం బిగించారు. ప్లాస్టిక్‌ను గ్రామం నుంచి తరిమివేయాలంటే మొక్కుబడి చర్యలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామస్తులు, వీడీసీ, వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీలు కలిసి లిఖిత పూర్వక తీర్మానాన్ని చేసి అమలు పరిచేలా చర్యలు తీసుకున్నారు. ప్లాస్టిక్‌ ఉపయోగిస్తే ఎంతటి వారైనా పదివేల రూపాయలు జరిమానా చెల్లించాలని తీర్మానించారు.

ఇందుకోసం గ్రామస్తులకు, షాపు యజమానులకు మూడు రోజుల సమయం ఇచ్చారు. మంగళవారం వీడీసీ, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్లాస్టిక్‌ను వినియోగించవద్దని అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలో గల కిరాణషాపులు, చికెన్, మటన్‌ సెంటర్, కూరగాయల షాపు యజమానులకు నోటీసులు ఇచ్చారు. ప్లాస్టిక్‌ రహిత గ్రామ పంచాయతీగా మార్చడంలో సహకరించాలని కోరారు. నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అలాగే ప్లాస్టిక్‌ ఉపయోగించిన వారి వివరాలను తెలిపిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని, వారి వివరాలు సైతం గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ వినోద్, ఎంపీటీసీ లింగవ్వ, ఎంపీఓ అశోక్, ఎంపీడీవో ఉషారాణి, వీడీసీ మెంబర్లు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యార్థులు చస్తున్నా పట్టించుకోరా..?!

అక్కడంతా అడ్డగోలే..!

సాగు భళా..రుణం డీలా? 

మంత్రాలు చేస్తానని చెప్పి లైంగికదాడి చేయబోతుంటే..

కూతుర్ని కొట్టిన తల్లికి జైలు

ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు

హాస్యనటుడు వేణుమాధవ్‌ ఆరోగ్యం విషమం

28 నుంచి ‘జాగృతి’ బతుకమ్మ

నట్టింట్లో ట్రింగ్‌..ట్రింగ్‌!

ఎంఐఎం  టిక్‌ టాక్‌

గురుకులాలు దేశానికే ఆదర్శం: మంత్రి కొప్పుల 

ఐక్యతకు ప్రతీక బతుకమ్మ 

ట్రీట్‌మెంట్‌ అదిరింది

బకాయిల ‘ఎత్తిపోత’

చెట్టు లేకపోతే భవిష్యత్‌ లేదు

రోడ్లన్నీ బిజీ.. కాస్త ఆలస్యంగా వెళ్లండి! 

3 రోజుల్లో తేల్చకుంటే సమ్మెబాట

ఉప పోరు హోరు

రుణమాఫీకి రూ.28 వేల కోట్లు

కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

‘ఒకే దేశం ఒకే జెండా బీజేపీ నినాదం’

ప్రజల ఓపిక నశిస్తోంది : లక్ష్మణ్‌

సిటీలో కుండపోత.. అర్ధరాత్రి దాకా ట్రాఫిక్‌ జామ్‌

రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లండి: భట్టి

హుజూర్‌నగర్‌ ఇన్‌చార్జిగా పల్లా

టీహబ్‌.. ఇంక్యుబెటర్‌

ఈనాటి ముఖ్యాంశాలు

ఆ నీళ్లతో ప్రజలు బట్టలు ఉతుకుతున్నారు!

నటుడు వేణు మాధవ్‌కు తీవ్ర అనారోగ్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చు..

దాదా.. షెహెన్‌షా

అడవుల్లో వంద రోజులు!

ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సింది

బ్రేకప్‌!

బచ్చన్‌ సాహెబ్‌