10 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

1 Nov, 2015 12:33 IST|Sakshi

వైర (ఖమ్మం) : అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న పది టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణం నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు.

అందులో సుమారు 10 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు రెవెన్యూ అధికారులకు వాటిని అప్పగించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని అతని నుంచి అదనపు సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు.

మరిన్ని వార్తలు